వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతి లేదు, జెండా ఎగరవేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్, కేసు పెట్టిన కేరళ పోలీసు, వీడియో !

|
Google Oneindia TeluguNews

కొచ్చి: 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేరళ అధికారులు అభ్యంతరం చెప్పినా ఆయన మాత్రం ఖాతరు చెయ్యకుండా జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ జెండా ఎగరవెయ్యడానికి తనకు హక్కు లేదా అంటూ మోహన్ భగవత్ కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంగళవారం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కర్ణక్కియమ్మన్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవెయ్యడానికి మోహన్ భగవత్ వెళ్లారు. అయితే ప్రభుత్వ నిధులు అందుతున్న ఈ పాఠశాలలో ప్రజాప్రతినిధులు, స్కూల్ అధికారులు మాత్రమే జెండా ఎగరవెయ్యాలని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

RSS chief Mohan Bhagwat raises flag at Kerala school defying govt order

రాజకీయ పార్టీల నాయకులు ఈ స్కూల్ లో జెండా ఎగరవెయ్యడం సరికాదని మోహన్ భగవత్ కు నోటీసులు ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి జాతీయ జెండా ఎగరవెయ్యాలని మోహన్ భగవత్ పట్టుబట్టారు. జిల్లా కలెక్టర్ రాకపోవడంతో అధికారులు అభ్యంతరం చెప్పినా మోహన్ భగవత్ జాతీయ జెండా ఎగవరవేశారు. స్థానిక పోలీసులు జాతీయ జెండా ఎగరవేస్తున్న సమయంలో తీసిన వీడియో ఆధారంగా మోహన్ భగవత్, కార్యక్రమం నిర్వహకుల మీద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

కేరళ ప్రభుత్వం చర్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు వద్దు అంటున్నా కేరళలో హింస పెరిగిపోయే విధంగా మోహన్ భగవత్ ప్రవర్తించారాని వామపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీటీ. బలరామ్ తన ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
RSS chief Mohan Bhagwat on Tuesday unfurled the Indian tricolour at a government-aided school despite being told by authorities that that political personalities were not permitted to hoist the flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X