వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రేపే అసెంబ్లీ సమావేశం, మెజారీటి లేదంటే సీఎం ఢమాల్ !

అన్నాడీఎంకే రెబల్ (పురట్చితలైవి) నాయకుడు పన్నీర్ సెల్వం విలీన నినాదాన్ని పక్కన పెట్టి మరింతగా దూకుడు పెంచేందుకు సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే కేడర్ తో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు విసృతం చెయ్యాలని

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే రెబల్ (పురట్చితలైవి) నాయకుడు పన్నీర్ సెల్వం విలీన నినాదాన్ని పక్కన పెట్టి మరింతగా దూకుడు పెంచేందుకు సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే కేడర్ తో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు విసృతం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

హలో దినకరన్: ఒక్క ఫోన్ కాల్ తో ఢిల్లీకి పరుగో పరుగు. తిక్కచేష్టలు చేస్తే శాశ్వతంగా !హలో దినకరన్: ఒక్క ఫోన్ కాల్ తో ఢిల్లీకి పరుగో పరుగు. తిక్కచేష్టలు చేస్తే శాశ్వతంగా !

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ నాటరాజన్ ను వెలివేశారు కాబ్బటి ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉన్న దృష్ణ్యా, కోశాధికారిగా పార్టీ శాసన సభాపక్ష సమావేశానికి పిలుపునిస్తున్నట్లు పన్నీర్ సెల్వం చెన్నైలో ప్రకటించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది.

పన్నీర్ ప్రకటనతో హడల్ !

పన్నీర్ ప్రకటనతో హడల్ !

పార్టీ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించే అధికారం కోశాధికారిగా తనకే ఉందని పన్నీర్ సెల్వం ప్రకటించడంతో అన్నాడీఎంకే (అమ్మ) శిబిరానికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఎలాగైనా పన్నీర్ సెల్వంతో రాజీ కావాలని ప్రయత్నాలు చేస్తున్న ఎడప్పాడి పళనిసామి సైతం షాక్ కు గురైనారు.

కమిటీ రద్దు చేసిన పన్నీర్ !

కమిటీ రద్దు చేసిన పన్నీర్ !

బుధవారం నుంచి తమిళనాడు శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం విలీనానికి ఆస్కారమే లేదని కుండలు బద్దలు కొట్టి చెప్పారు. అంతే కాకుండ చర్చల కమిటీని తాము రద్దు చేస్తున్నామని పన్నీర్ సెల్వం బహిరంగంగా చెప్పారు.

 దినకరన్ రూపంలో సమస్యలు !

దినకరన్ రూపంలో సమస్యలు !

జైలు నుంచి విడుదలైన తరువాత టీటీవీ దినకరన్ సీఎం పళనిసామికి వ్యతిరేకంగా పావులుకదిపారు. 33 మంది ఎమ్మెల్మేలను తనవైపు తిప్పుకున్నాడు. దినకరన్ రూపంలో సమస్యలు బయలుదేరుతున్న వేళ పన్నీర్ సెల్వం ద్వారా గట్టెక్క వచ్చు అంటూ ఇన్ని రోజులు పనిళనిసామి వర్గీయులు ఎదురు చూశారు.

పన్నీర్ ప్లాన్ వేశారంటే ?

పన్నీర్ ప్లాన్ వేశారంటే ?

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న ఒక్క రోజు ముందు పన్నీర్ సెల్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. విలీనం మాట తన దగ్గర వినిపించకూడదని బహిరంగంగా చెప్పడంతో పళనిసామి వర్గం హడలిపోయింది. ఇప్పుడు పన్నీర్ సెల్వం చెప్పిన మాట వినేస్థితిలో కనిపించడం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు.

శశికళ విషయంలో నాటకాలు !

శశికళ విషయంలో నాటకాలు !

శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి సాగనంపడానికి పళనిసామి సిద్దంగా ఉన్నారని ఆయన వర్గం చెబుతున్నా వారి నాటకాలు నమ్మే స్థితిలో తాము లేమని పన్నీర్ సెల్వం వర్గం అంటోంది. నాటకాలు తనకు చేతకావు అని, రక్తికంటించే వారు కట్టిస్తున్నారని పన్నీర్ సెల్వం పరోక్షంగా పళనిసామి వర్గానికి చురకలు అంటించారు.

పళనిసామి పరుగో పరుగు !

పళనిసామి పరుగో పరుగు !

పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలతో పళనిసామి పరుగో పరుగు అంటు సచివాలయం చేరుకున్నారు. తరువాత తనకు అత్యంత సన్నిహితుడు, సీనియర్ మంత్రి జయకుమార్ ను రంగంలోకి దింపారు. వెంటనే విలీనం విషయం మాట్లాడాలని సూచించారు.

అయ్యా పన్నీర్ సెల్వం గారు !

అయ్యా పన్నీర్ సెల్వం గారు !

విలీనం విషయంలో పన్నీర్ సెల్వం మరోసారి ఆలోచించాలని మంత్రి జయకుమార్ మీడియా ద్వారా మాజీ సీఎంకు మనవి చేశారు. పన్నీర్ సెల్వం మా వైపు రావడానికి ప్రయత్నించాలని, అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి జయకుమార్ అన్నారు.

నో చాన్స్ ఇక అంతే

నో చాన్స్ ఇక అంతే

మంత్రి జయకుమార్ విలీనానికి తాము సిద్దం అంటూ మీడియా ముందు చెప్పినా పన్నీర్ సెల్వం వర్గం నుంచి మాత్రం స్పందన శూన్యం. కనీసం విలీనం విషయంపై మాట్లాడటానికి సైతం పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు ఆసక్తి చూపించడం లేదు.

అసెంబ్లీలో తేలిపోతుందా ?

అసెంబ్లీలో తేలిపోతుందా ?

బుధవారం తమిళనాడు శాసన సభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరిలో జరిగిన బలపరీక్ష సందర్బంగా సీఎం పళనిసామికి 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే 122 మందిలో 33 మంది దినకరన్ వైపు జంప్ అయ్యారు. ఇప్పుడు పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో ఉంది. ఒక వేళ అసెంబ్లీ సమావేశాల్లో బలపరీక్షజరిగితే పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Tamil Nadu former CM Panneerselvam announced the decision to disband the seven-member team to negotiate the merger of the two factions in the AIADMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X