వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌పై ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్: 66.90కి పడిపోయిన రూపాయి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎల్వోసీ వద్ద సర్జికల్ స్ట్రయిక్ దాడులు కొనసాగుతున్నాయని సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఓ వైపు సెన్సెక్స్ పడిపోయింది. మరోవైపు, రూపాయి బలహీనపడింది. గురువారం నాడు రూపాయి విలువ 66.90కి పడిపోయింది.

పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు ఎల్వోసీ వద్ద దాడులు కొనసాగుతున్నాయని డీజీఎంవో రణ్‌బీర్ సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దాడుల విషయంపై పాకిస్థాన్‌కు సమాచారం అందించామన్నారు.

సరిహద్దుల్లో పాక్‌ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. ఇటీవల కాలంలోనే దాదాపు 20సార్లు పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఎల్వోసీ వద్ద గత రాత్రి దాడులు నిర్వహించామని, వారికి ఇదో గుణపాఠం అన్నారు. సైన్యం ప్రకటన నేపథ్యంలో సెన్సెక్ పడిపోయింది.

Rupee plunges to 66.90 as Indian Army conducts surgical strikes across LoC

బుధవారం నాడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 66.46వద్ద ముగిసింది. గురువారం ఉదయం 66.43తో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆర్మీ ప్రకటన నేపథ్యంలో 66.90కి పతనమైంది.

ఎల్వోసీ వద్ద సర్జికల్ స్ట్రయిక్ దాడులు కొనసాగుతున్నాయని సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఓ వైపు సెన్సెక్స్ పడిపోయింది. మరోవైపు, రూపాయి బలహీనపడింది. గురువారం నాడు రూపాయి విలువ 66.90కి పడిపోయింది.

English summary
The rupee plunged to 66.90 as India conducted surgical strikes on terror launch pads last night across the Line of Control (LoC) and inflicted significant casualties and heavy damages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X