వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన సార్క్ సదస్సు: పప్పు, రోటీలు తిన్న మోడీ... చికెన్, మటన్ లాగించిన షరీఫ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు రోజుల 18వ సార్క్ సమావేశాలు ఈరోజుతో ముగిశాయి. రెండవ రోజైన ఈరోజు సార్క్ దేశాలు ఇందన సహకారంపై సంతకాలు చేశాయి. మోటారు వాహనాలు, రైల్వే ఒప్పందాలపై సభ్య దేశాలు మూడు నెలలు గడువు కోరాయి.

ఇక వచ్చే సార్క్ సమావేశాలు పాకిస్ధాన్‌లో జరుగుతాయని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ప్రకటించారు. ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన సార్క్ దేశాల సదస్సులో భారత్, పాక్ ప్రధానుల మధ్య ఎటువంటి చర్చలూ జరగలేదు.

ఈ సమావేశంలో సార్క్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి భారత్ చేసిన ప్రతిపాదనలను పాకిస్ధాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సదస్సు చివరి రోజైన గురువారం సంప్రదాయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

గురువారం సార్క్ దేశాధినేతలు ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌లు కరచాలనం చేసి పలకరించుకున్నారు. సార్క్ సదస్సులో భాగంగా నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ సాదాసీదా భోజనం తీసుకున్నారు.

ఖాట్మండ్‌లోని హోటల్ క్రౌన్ ప్లాజాలో బస చేసిన మోడీ మధ్యాహ్నా భోజనంలో జీరా రైస్, పప్పు, రోటీలను ఆహారంగా తీసుకున్నారు. ఆయన కోసం తక్కువ నూనె వేసి ఆహార పదార్థాలను తయారు చేసినట్టు హోటల్ వర్గాలు వెల్లడించాయి.

రాత్రి డిన్నర్‌లోనూ ఆయన మితాహారమే తీసుకున్నారని సమాచారం. ఉదయం టిఫిన్‌లో ఊతప్పం, ఇడ్లీలను చెఫ్‌లు తయారుచేసి అందించారు. ఇదే సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చికెన్, మటన్, ఫిష్ తదితరాలతో భారీ మెనూను ఏర్పాటు చేశామని హోటల్ ప్రతినిధులు తెలిపారు.

 ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ దేశాధినేతలు నరేంద్రమోడీ, నవాజ్ షరీఫ్, సుశీల్ కొయిరాలా.

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

సార్క్ సదస్సులో గురువారమైన చివరిరోజు కరచాలనం చేసి పలకరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌లు.

 ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌లు.

 ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

సార్క్ సదస్సులో గురువారమైన చివరిరోజు కరచాలనం చేసి పలకరించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌లు.

 ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ దేశాధినేతలు నరేంద్రమోడీ, నవాజ్ షరీఫ్, సుశీల్ కొయిరాలా, మహేంద్ర రాజపక్సే, ఆశ్రఫ్ ఘనీ.

 ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు


ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.

 ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ముగిసిన 18వ సార్క్ సమావేశాలు

ఖాట్మండ్ వెలుపల ప్రఖ్యాత ప్రాంతమైన ధులికేల్ సందర్శనకు వెళ్లిన సార్క్ ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌లు.

English summary
The 18th SAARC Summit has concluded this afternoon in Kathmandu by adopting the Kathmandu Declaration 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X