నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవంబర్ 16న నెల్లూరులో సచిన్: షెడ్యూల్ ఖరారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా గూడూరులోని పుత్తమరాజు కండ్రిగ గ్రామానికి రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నవంబర్ 16న వస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ జి. రేఖావాణి చెప్పారు. శుక్రవాం ఆమె తన ఛాంబర్‌లో విలేకర్లతో ఈ విషయమై మాట్లాడారు.

నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు సచిన్ ముంబై నుంచి చెన్నై చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కృష్ణపట్నం పోర్టుకు వస్తారని పేర్కొన్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం 9 గంటలకు గూడూరులోని పుత్తమరాజు కండ్రిగకు చేరుకుంటారు.

Sachin Tendulkar To Develop Nellore On Sansad Gram Yojana

గ్రామంలో రూ. 3.50 కోట్లతో ఆ గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులను సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదగా ప్రారంభిస్తాడు. మధ్యాహ్నాం 12 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్‌ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్‌సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్‌ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.

English summary
Legendary cricketer and Rajya Sabha member Sachin Tendulkar is reportedly planning to adopt a village in Nellore district under 'Sansad Gram Yojana' programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X