వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుపౌర్ణమి: గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌తో సచిన్ సెల్ఫీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈరోజు గురుపౌర్ణమి. మహర్షి వేద వ్యాసుని పుట్టిన రోజు. అందుకే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస పౌర్ణమిని ఆదిశంకరాచార్యుల వారు తొలిసారిగా నిర్వహించినట్టు చెబుతారు. మానవ జీవితంలో గురువుకు ఉన్న ప్రాధాన్యతను గమనించే తల్లిదండ్రుల తరువాత 'ఆచార్య దేవోభవ' అని అన్నారు.

ఆషాఢ మాసంలో వచ్చే ఈ గురుపౌర్ణమి పర్వదినాన్ని గురువుల దినోత్సవంగా హిందువులు భావిస్తారు. ఈ రోజు గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి, వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అందుకేనేమో గురుపౌర్ణమి సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Sachin Tendulkar takes blessings of his Guru, Ramakanth Achrekar on the auspicious day of Guru Purnima

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ కూడా గురుపౌర్ణమి సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

గురుపౌర్ణమిను పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడీలో సాయిబాబా తన భక్తులకు తొలిసారిగా ఉపదేశమిచ్చిన రోజు కూడా ఇదే. గురుపౌర్ణమి పురస్కరించుకుని షిరిడిలోని సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

English summary
Sachin Tendulkar takes blessings of his Guru, Ramakanth Achrekar on the auspicious day of Guru Purnima.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X