వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు మెట్లెక్కనున్న టెక్కీలు: యూనియన్లు ఏర్పాటు చేసుకోనున్న ఐటీ ఉద్యోగులు

ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతపై టెక్కీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగిస్తున్నారనే ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతపై టెక్కీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగిస్తున్నారనే ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. కంపెనీల తీరును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు కోర్టు మెట్లెక్కనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చును తగ్గించుకొనే పనిలో పడ్డాయి.ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నాలను ప్రారంభించాయి.

నోటీసులు అందుకొన్న ఉద్యోగులు లేబర్ కమిషనర్, లేబర్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాలను ఆశ్రయించారు. మరో వైపు ఐటీ ఉద్యోగులు, ఇక కోర్టు మెట్లెక్కేందుకు కూడ సిద్దమౌతున్నారు.

నేషనల్ డమొక్రటిక్ లేబర్ ఫ్రంట్ ఐటీ ఉద్యోగుల వింగ్ తమ గోడును వినిపించుకోవడానికి మద్రాస్ కోర్టును ఆశ్రయించాలని ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు. టెక్ దిగ్గజాలు కాగ్నిజెంట్, విప్రోలు ఏకపక్షంగా తమను తొలగిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల వింగ్ కోర్టుకు తెలిపేందుకు సిద్దమైంది.

ఈ రెండు కంపెనీలు దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమౌతున్నాయని ఉద్యోగుల వింగ్ చెబుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఈ రెండు కంపెనీలకు వ్యతిరేకంగా లేబర్ కమిషన్ లేబర్ సెక్రటరీలను కలిసినట్టు తమిళనాడు కు చెందిన ఎన్ డి ఎల్ ఎప్ చెప్పింది.

పూర్ పెర్మానెన్స్ పేనరుతో ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయాలని ఆదేశిస్తున్నట్టు ఉద్యోగుల వింగ్ పేర్కొంది. ఏకపక్షంగా రేటింగ్ కూడ ఇస్తున్నట్టు చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీ ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటు చేసుకోవాలని ఎన్ డి ఎల్ ఎప్ సూచించింది.

ప్రస్తుతం ఎన్ డి ఎల్ ఎప్ తమిళనాడు, తెలంగాణలో మాత్రానికే పరిమితమై ఉండగా పూణె, బెంగుళూరు, గుర్గావ్, కోల్ కతాలో ఐటీ ఉద్యోగులతో కూడ ఈ ఎన్ డి ఎల్ ఎప్ చర్చలు జరుపుతోంది. దేశ వ్యాప్తంగా తమ నిరసనలు తెలపాలని ఐటీ ఉద్యోగుల వింగ్ యోచిస్తోంది.

English summary
The National Democratic Labour Front IT Employees wing is planning to approach the Madras High Court against what it calls the arbitrary downsizing of employees by Cognizant and Wipro. It says the two companies are planning to lay off as many as 30,000 employees between them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X