వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడేసుకుంటున్నారు, ఎవరీ దయ అవసరం లేదు: బయటికొచ్చిన మాల్యా

భారత్‌లో ప్రధాన పార్టీలు తనను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నాయని బ్యాంక్‌లకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌మాల్యా అన్నారు.

|
Google Oneindia TeluguNews

లండన్‌: భారత్‌లో ప్రధాన పార్టీలు తనను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నాయని
మనదేశంలోని బ్యాంక్‌లకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌మాల్యా అన్నారు. ఈ విషయం ఇటీవల ఎన్నికల్లో పార్టీ నేతల ప్రసంగాల్లో తేటతెల్లమైందని తెలిపారు.

వారు ఆధారాలతో రానివ్వండి.. అసలు వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చట్టం ఎప్పుడో తనపని తాను చేసుకుపోయేదని అన్నారు. యూకే చట్టాల కింద సురక్షితంగా ఉన్నానన్నారు.

Safe in UK, don't want to be at the mercy of a ‘maverick’: Vijay Mallya

భారతప్రభుత్వంలో ఎవరో దయతో బతికే కంటే ఇది సురక్షితమని మాల్యా తెలిపారు. కాగా, భారత అధికారులు.. యూకే అధికారులతో మాల్యా అప్పగింతపై చర్చలు జరిపిన రెండు రోజుల తర్వాత ఆయన ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

బయటి ఈవెంట్లో విజయ్ మాల్యా

mallya

విజయ్ మాల్యా ఫార్ములా వన్‌ కారు రేసింగ్‌ బృందం సహారా ఫోర్స్‌ కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిల్వర్‌స్టోన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన డ్రైవర్లు పెరీజ్‌, ఈస్ట్‌బన్‌తో కలిసి ఫొటోలు దిగారు. వీటిన ఫార్ములా వన్‌.కామ్‌లో అప్‌లోడ్ చేశారు. మన దేశం నుంచి పారిపోయిన తర్వాత లండన్‌లోనే అజ్ఞాతంలో ఉంటున్న విజయ్ మాల్యా.. తొలిసారి ఇలా బయట జరిగిన కార్యక్రమంలో దర్శనమివ్వడం గమనార్హం.

English summary
"I have become a political football," said liquor baron Vijay Mallya whose extradition from the United Kingdom, India has sought. Mallya said that the election rhetoric by the two major Indian parties is evident that he has become a 'political football'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X