వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ సినిమాలు ఇప్పటికీ చూస్తా: శిక్ష కంటే పరిహారం ముఖ్యమన్న బాధితుడు

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు 2002 హిట్‌ అండ్‌ రన్‌ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో కారు ఢీకొన్న ప్రమాదంలో బాధితులు మాత్రం అతడికి శిక్ష పడటం కంటే.. తమకు పరిహారం అందడమే ముఖ్యమని అంటున్నారు.

అబ్దుల్లా రవూఫ్‌ షేక్‌ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో కాలు కోల్పోయారు. ఆయన మాట్లాడుతూ.. గత 13ఏళ్లుగా తన వద్దకు ఎవ్వరూ రాలేదని, ఏదో పనిచేసుకుంటూ బతుకుతున్నానని, చాలా సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు.

సల్మాన్‌ పట్ల తమకు కఠినమైన భావనలేమీ లేవని.. అతడి సినిమాలు ఇప్పటికీ చూస్తానని తెలిపారు. ఆయనకు శిక్షపడడం కంటే తమకు పరిహారమే ముఖ్యమని షేక్‌ పేర్కొన్నారు.

 Salman Khan hit-and-run case: For victims, compensation matters more than conviction

'సల్మాన్‌కు శిక్ష పడడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. నా కాలు తిరిగి రాదు.. నా సమస్యలేమీ తగ్గవు' అని అబ్దుల్లా షేక్‌ వెల్లడించారు. ప్రమాదానికి గురైనప్పుడు తన వయస్సు 22ఏళ్లని గుర్తు చేసుకున్నాడు.

కాగా, ప్రమాదంలో మృతిచెందిన నౌరుల్లా మెహబూబ్‌ షరీఫ్‌ భార్య మాట్లాడుతూ.. నష్ట పరిహారంగా డబ్బు కంటే తన కుమారుడికి ఉద్యోగం ఇస్తే తమకు ఆసరాగా ఉంటుందని తెలిపారు.

English summary
“Compensation matters more than conviction,” say the victims of the 2002 hit-and-run case in which Bollywood star Salman Khan has been sentenced to five years in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X