వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ ఖాన్‌కు బెయిల్ ఎలా ఇస్తారు: సుప్రీంలో పిటిషన్ దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒక న్యాయవాది గురువారంనాడు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సల్మాన్‌ ఖాన్‌పై వచ్చిన అభియోగాలన్నీ రుజువైనట్టు కోర్టు తీర్పు చెప్పిన అనంతరం మళ్లీ బెయిల్‌ ఇవ్వడాన్ని ఆ న్యాయవాది ఆక్షేపించారు.

బెయిలును వెంటనే రద్దు చేసి సల్మాన్ ఖాన్‌కు విధించిన జైలు శిక్షను అమలు చేయాలని ఆయన కోరారు. అఖిలేష్ చౌబే అనే ఎంఎన్ఎస్ నాయకుడు, న్యాయవాది ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. బొంబాయి హైకోర్టు సల్మాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Salman Khan interim bail in hit-and-run case challenged in SC

సల్మాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే విషయంలో హైకోర్టు అతి వేగాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. హైకోర్టులో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు.

హిట్ అండ్ రన్ కేసులో బుధవారంనాడు సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా, బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ ప్రారంభం కానుంది. శుక్రవారం బొంబాయి హైకోర్టుకు చివరి పని దినం. ఆ రోజు తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 7వ తేదీన హైకోర్టు ప్రారంభమవుతుంది.

English summary
In what is likely to spell more trouble for Bollywood superstar Salman Khan, a petition challenging the interim bail granted to him by the Bombay High Court yesterday has been filed in the Supreme Court on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X