వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఫోన్లలో టన్నులకొద్దీ బంగారం, అందుకే వెనక్కి తీసుకొంటున్న శాంసంగ్

సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని వెలికితీసేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్లను తిరిగి వెనక్కి తీసుకొంటోంది ఆ కంపెనీ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్: సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని వెలికితీసేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్లను తిరిగి వెనక్కి తీసుకొంటోంది ఆ కంపెనీ.

సాంకేతిక లోపాలతో గత ఏడాది అత్యధికంగా వార్తల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కంపెనీ వార్తల్లో నిలిచింది. దీంతో ఈ ఫోన్లన్నింటిని వెనక్కు తీసుకొంటున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లను తిరిగి వెనక్కు తీసుకోనుంది. ఈ ఫోన్లను రీసైకిల్ చేయనుంది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీసైకిల్ చేయడం ద్వారా 157 టన్నుల బంగారం, వెండి , కోబాల్డ్, రాగి వంటి విలువైన లోహలను సేకరించనుందని తెలిపింది.

Samsung to recover rare metals, components in Galaxy Note 7s

ఈ నెల చివరిలోపుగా ఈ ప్రకియను శాంసంగ్ ఆరంభించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఫోన్‌లోని కొన్ని ముఖ్య బాగాలను మాత్రం విడగొట్టి భద్రపర్చనున్నారు. శాంసంగ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, మెమొరీ సెమీ కండక్టర్లు, కెమెరా మాడ్యూల్స్‌ను విడిగా భద్రపరుస్తోంది.

రీ సైకిల్ ప్రక్రియ మొత్తం ఎకో-ఫ్రెండ్లీ పద్దతుల్లోనే చేయనున్నట్టు తెలిసింది. కొన్ని విడి భాగాలను నోటీఎఫ్ఈ సర్వీస్ మెటీరియల్‌గా వినియోగించనుంది.

అయితే ఎవరికీ విక్రయించని నోట్7 ఫోన్లకు సరికొత్త టెక్నాలజీతో తీర్చిదిద్దిన 3200 ఎంఎహెచ్ బ్యాటరీని అమర్చి నోట్ ఎఫ్ఈ పేరుతో తీసుకొచ్చింది.

English summary
Samsung Electronics plans to recover gold and other metals and components from recalled Galaxy Note 7 smartphones to reduce waste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X