వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత లాగా శశికళ కట్టు, బొట్టు మార్చేసి అమ్మ కారులో

జయలలిత ఇంత కాలం ఉపయోగించిన కారులోనే నెచ్చెలి శశికళ ప్రయాణించారు. అమ్మ ఉపయోగించిన కారులో శశికళ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత ఇంత కాలం ఉపయోగించిన కారులోనే నెచ్చెలి శశికళ ప్రయాణించారు. అమ్మ ఉపయోగించిన కారులో శశికళ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మొదట అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ. రామచంద్రన్ కు నివాళులు అర్పించారు.

అనంతరం కార్యాలయంలో జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. జయలలిత లేని లోటును మనకు ఎవ్వరూ తీర్చలేరని చెప్పారు. మనం అమ్మా అమ్మా అని పిలుచుకుని జయలలిత లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నామని శశికళ కన్నీటిపర్యంతమైనారు.

అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ

ఇంత కాలం మనం అమ్మా అని పిలుచుకున్న జయలలితకు మనం జీవితాంతం రుణపడి ఉండాలని నాయకులకు సూచించారు. జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలు, అన్ని కార్యక్రమాలు ముందుకు కొనసాగించాలని అన్నారు.

అమ్మ చెప్పిన మాటలు మనం అందరూ గుర్తు పెట్టుకోవాలని, ఆమె ఆశయాలను తప్పకుండా పాటించాలని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీని అంతం చెయ్యడం ఎవ్వరికి సాధ్యం కాదని శశికళ అన్నారు.

Sasikal Natarajan Used jayalalithaa's car

ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించి ముందుకు నడిపించారని, ఆయన మరణించిన తరువాత పార్టీ పగ్టాలు చేపట్టిన అమ్మ జయలలిత పార్టీని పరుగు తీయించారని, ప్రజలకు సేవ చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

పన్నీర్ సెల్వం రాజీనామా ? ఎక్కడ చూసినా ఇవే ఫ్లెక్సీలు

అలాంటి అమ్మకు ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకుండా మనం అందరం పార్టీని కలిసికట్టుగా ముందుకు తీసుకు వెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. అన్నాడీఎంకే పార్టీని చీల్చడం ఎవ్వరికీ సాధ్యంకాదని గుర్తు పెట్టుకోవాలని శశికళ పరోక్షంగా ప్రతిపక్ష నాయకులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మదుసూధన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. పార్టీ ప్రాంగణంలో ఎంజీర్, జయలలిత, శశికళ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

English summary
Sasikala Natarajan pulled a Jayalalithaa on the All India Anna Dravida Munnetra Kazhagam cadre as she took over the leadership of the party as its general secretary. While keeping mum on it all the while, Sasikala Natarajan accepted the party’s resolution to appoint her as the general secretary without any qualms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X