వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్యంగా చెన్నై స్టార్ హోటల్ లో భేటీ: సంతకాలు సేకరించిన సీఎం పళనిసామి !

పన్నీర్ సెల్వం వర్గం నుంచి మాజీ మంత్రులు కేపీ మునిసామి, నత్తం విశ్వనాథన్, ఎడప్పాడి పళనిసామి వర్గం నుంచి ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రాత్రి చెన్నైలోని ఓ సార్ట్ హోటల్ లో రహస్యంగా సమావేశం అయ్యి ద

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం ఆగిందనకున్నారు అందరూ. అయితే చర్చలకు జీవంపోసే పనిలో రెండు శిబిరాల నేతలు నిమగ్నం అయ్యారు. మంగళవారం అర్దరాత్రి దినకరన్ అరెస్టు కావడంతో కంగుతిన్న ఎడప్పాడి పళనిసామి వర్గం దూకుడు పెంచింది.

పన్నీర్ సెల్వంతో రాజీనే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. పనిలో పనిగా కార్యకర్తలను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గరకు రప్పించి అక్కడ ఏర్పాటు చేసిన శశికళ బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫోటోలు తొలగించి చెత్తకుప్పల్లో పడేయించి పన్నీర్ వర్గం డిమాండ్ కు అంగీకరించినట్లు సంకేతాలు పంపించారు. ఎడప్పాడి ప్రభుత్వం శశికళ బ్యానర్లు తొలగించడాన్ని పన్నీర్ సెల్వం వర్గం స్వాగతించి చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అదిలోనే హంసపాదు

అదిలోనే హంసపాదు

అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు ఏకమయ్యే విధంగా వారం పదిరోజులుగా చర్చసాగుతూ వచ్చినా ఇరు వర్గాల మధ్య పేలుతూ వచ్చిన మాటల తూటాలు, తెర మీదకు వచ్చిన కీలక డిమాండ్ల పర్వాలు వెరసి అదిలోనే హంసపాదు అన్నట్లుగా విలీన చర్చల వ్యవహారం మారింది.

వాయిదా పడినా పర్వాలేదు

వాయిదా పడినా పర్వాలేదు

విలీన చర్చలకు తేదీ నిర్ణయించారు. అయితే రెండు వర్గాలు బెట్టు చేశాయి. చివరికి రెండు వర్గాలు ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో చర్చలకు స్వస్తి చెప్పారని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ ఊహాగానాలకు చెక్ పెట్టాలని రెండు వర్గాల నాయకులు నిర్ణయించారు.

రహస్యంగా స్టార్ హోటల్ లో

రహస్యంగా స్టార్ హోటల్ లో

పన్నీర్ సెల్వం వర్గం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా మంతనాలు జరిపారు. రాత్రి భేటి అయిన నేతలు దాదాపు ఎనిమిది గంటల పాటు విలీనం గురించి ఇరు వర్గాలు చర్చించుకున్నారు. విలీనం విషయంలో వారు ఓ అభిప్రాయానికి వచ్చారని వెలుగు చూసింది.

రెండు వర్గాల్లోని కీలకనేతలు భేటీ

రెండు వర్గాల్లోని కీలకనేతలు భేటీ

పన్నీర్ సెల్వం వర్గం నుంచి మాజీ మంత్రులు కేపీ మునిసామి, నత్తం విశ్వనాథన్, ఎడప్పాడి పళనిసామి వర్గం నుంచి ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రాత్రి సార్ట్ హోటల్ లో రహస్యంగా సమావేశం అయ్యి దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చీంచారని వెలుగు చూసింది.

ప్రత్యక్షంగా సీన్ లోని సీఎం పళనిసామి

ప్రత్యక్షంగా సీన్ లోని సీఎం పళనిసామి

అన్నాడీఎంకే పార్టీకి చెందిన అన్ని జిల్లాల కార్యదర్శులతో సమావేశం అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి విలీనం విషయంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా కార్యదర్శల దగ్గర సంతకాలు సేకరించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మీరు ఎవ్వరికైనా ఇవ్వండి, మేము అంగీకరిస్తాం అంటూ వారు సంతకాలు చేశారని తెలిసింది.

English summary
Banners featuring AIADMK general secretary Sasikala were today pulled down from the party headquarters here, a move welcomed by the rival Panneerselvam camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X