వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జైలు నుంచి ఫోన్లో మాట్లాడిన శశికళ, సీఎం-మంత్రులకు ఆదేశాలు

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ శనివారం నాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ఫోన్‌లో మాట్లాడారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పళనిస్వామి శనివారం నాడు బలనిరూపణలో గెలుపొందారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ శనివారం నాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ఫోన్‌లో మాట్లాడారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పళనిస్వామి శనివారం నాడు బలనిరూపణలో గెలుపొందారు.

తన వర్గానికి చెందిన పళని సీఎం కావడంతో, బలపరీక్షలో కూడా ఆయన నెగ్గడంతో జైలులో శశికళ ఆనందానికి అవధుల్లేవు. సుప్రీం తీర్పుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో కటకటాలు లెక్కిస్తున్న శశికళ శనివారం తమిళనాడులో జరిగిన పరిణామాలను టీవీలో వీక్షించారు.

<strong>శశికళకు ల్యాప్‌టాప్ ఇవ్వండి, నాశనం...: నటుడు సిద్ధార్థ ఆగ్రహం</strong>శశికళకు ల్యాప్‌టాప్ ఇవ్వండి, నాశనం...: నటుడు సిద్ధార్థ ఆగ్రహం

పళని బల పరీక్ష నెగ్గగానే ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సమయంలో శశికళ పళనికి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది మంత్రులతో కూడా శశికళ ఫోన్లో మాట్లాడారు.

Sasikala glued to TV, congratulates new CM Palaniswami over phone

గురువారం రాత్రి జైలులోని మొదటి ఫ్లోర్‌లో ఉన్న శశికళ తనకు టీవీ చూసేందుకు అనుమతినివ్వాల్సిందిగా జైలు ఉన్నతాధికారులను కోరారు. ఆమె కోరికను మన్నించిన అధికారులు టీవీ చూసేందుకు అనుమతించారు. దీంతో ఆమె తన గదిలో నుంచి బయటికొచ్చి టీవీ చూశారు.

<strong>బూటు కాళ్లతో తన్నారు, ఆత్మహత్య చేసుకుంటా: పోలీసుల్ని బెదిరించిన స్టాలిన్</strong>బూటు కాళ్లతో తన్నారు, ఆత్మహత్య చేసుకుంటా: పోలీసుల్ని బెదిరించిన స్టాలిన్

శనివారం అసెంబ్లీలో జరిగిన ప్రతీ సన్నివేశాన్ని శశికళ వీక్షించారు. పళని నెగ్గగానే ఆమె గదికి తిరిగెళ్లారు. ఆయనకు ఫోన్ చేసి దాదాపు ఏడు గంటల వరకూ మాట్లాడారు. కొందరు న్యాయ నిపుణులతో కూడా శశికళ సంప్రదింపులు జరిపారు.

తనకు ఏ క్లాస్ గదిని కేటాయించేలా చూడాలని ఆమె న్యాయనిపుణులకు సూచించారు. ఆమె తరపు లాయర్ కులశేఖరన్ ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. శశికళ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, ఆమెకు ఏ క్లాస్ గది కేటాయించాలని కోరినట్లు కులశేఖరన్ తెలిపారు. ఇదంతా పక్కన పెడితే, ఆమెకు ఫోన్ ఎవరిచ్చారనేది చిక్కు ప్రశ్నగా మిగిలింది.

English summary
VK Sasikala, who's lodged in Parappana Agrahara central prison, watched the developments in Tamil Nadu on television in a special room on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X