పన్నీర్ సెల్వం, శశికళ వర్గం బిగ్ ఫైట్: అందు కోసమే! ఏవరికి వస్తోంది ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాయం కావడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆయోమయంలో పడిపోయారు. రెండాకుల గుర్తు మాయం కావడంతో ఆపార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోడానికి పన్నీర్ సెల్వ వర్గీయులు సిద్దం అయ్యారు.

చెన్నై నగరంలోని రాయపేటలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం శశికళ వర్గీయులు మకాం వేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు ఎవ్వరికీ కేటాయించకపోవడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు, శశికళ వర్గీయులు ఇప్పటికే ఆందోళన చెందారు.

Sasikala and OPS teams are now fighting each other for party office which is situated at Royapettah.

ఈ సమయంలో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని సొంతం చేసుకోవాలని పన్నీర్ సెల్వం, శశికళ వర్గీయులు పోటీ పడుతున్నారు. శనివారం అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ పార్టీ కార్యాలయంలోకి వచ్చి వెళ్లారు.

ఈ సందర్బంలోనే పన్నీర్ సెల్వం వర్గీయులు ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని శశికళ వర్గానికి దూరం చెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు చేస్తున్నది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After Twin leaf symbol of AIADMK was frozen by Election Commission, Sasikala and OPS teams are now fighting each other for party office which is situated at Royapettah, Chennai.
Please Wait while comments are loading...