బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ కర్మకాండ, సీసీ టీవీ క్లిప్పింగ్, మాజీ ఐఏఏస్ నివేదిక, చిక్కుల్లో చిన్నమ్మ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ అనుభవించారని వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి అయ్యిందని సమాచారం. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ? అనే విషయంపై ప్రత్యేక బృందం అధికారులు విచారణ చేశారు.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాయల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని, తాను స్వయంగా చూశానని అప్పటి కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప సంచలన ఆరోపణలు చేశారు. శశికళకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఆమె కుటుంబ సభ్యుల దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రూ. 2 కోట్లు లంచం ఎవరికి ?

రూ. 2 కోట్లు లంచం ఎవరికి ?

రూ. 2 కోట్లు లంచం జైళ్ల శాఖ సీనియర్ అధికారితో పాటు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు తీసుకున్నారని డీఐజీ రూప బాంబు పేల్చారు. పై అధికారుల విషయంలో మీడియాకు చెప్పి రచ్చ రచ్చ చేశారని కర్ణాటక ప్రభుత్వం డీఐజీ రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది.

Recommended Video

BREAKING VIDEO - Bengaluru : Sasikala Reaches Bengaluru Jail - Watch Video - Oneindia Telugu
దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ

దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ

శశికళ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తియ్యడంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది. రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు.

డీఐజీ రూప వివరణ ?

డీఐజీ రూప వివరణ ?

శశికళకు జైల్లో ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు అని రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేసింది. జైల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలించారు. చెన్నైలో శశికళ కుటుంబ సభ్యులను విచారణ చేశారు. శశికళ విషయంలో ఆరోపణలు చేసిన డీఐజీ రూప దగ్గర వివరణ తీసుకున్నారని తెలిసింది.

నెల పూర్తి అయ్యింది

నెల పూర్తి అయ్యింది

ఒక నెలల లోపు నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం సూచించడంతో ఆగస్టు 10వ తేదీకి గడుపు పూర్తి అయ్యింది. రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేసిన పూర్తి వివరాలు సీల్డ్ కవర్ లో పెట్టి ఈనెల 14వ తేది కర్ణాటక ప్రభుత్వానికి అందించాలని మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నిర్ణయించారని తెలిసింది.

చిక్కుల్లో చిన్నమ్మ ?

చిక్కుల్లో చిన్నమ్మ ?

శశికళ జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవించారు ? అని వెలుగు చూసినా, అధికారులకు రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని తెలిసినా ఆమెకు మరన్ని కష్టాలు తప్పవని న్యాయనిపుణులు అంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేంది డీఐజీ రూప మీద పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

English summary
IAS officer Vinay Kumar will submits the probe report into allegations that AIADMK leader VK Sasikala paid a bribe of Rs 2 crore to a top jail officer and staff for availing perks in the Bengaluru Central Prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X