వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ విషయం!: ఈసీ నోటీసులకు శశికళ వివరణ, 72 పేజీల లేఖ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మంగళవారం నాడు తన ఎన్నికకు సంబంధించిన అంశంపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. ఆమె తరఫున పార్టీ న్యాయవాదులు ఈీసికి వివరణ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మంగళవారం నాడు తన ఎన్నికకు సంబంధించిన అంశంపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. ఆమె తరఫున పార్టీ న్యాయవాదులు ఈీసికి వివరణ ఇచ్చారు.

అన్నాడీఎంకే న్యాయవాదులు 72 పేజీల వివరణను ఈసీకి సమర్పించారు. పన్నీర్ సెల్వం మద్దతురాలు చేసిన ఆరోపణలను ఈ వివరణలో శశికళ తోసిపుచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిని కార్యకర్తలు ఎన్నుకుంటారని, తాత్కాలిక ప్రదాన కార్యదర్శిగా తన నియామకం తాత్కాలిక చర్య మాత్రమేనని శశికళ తన సమాధానంలో వివరించారు.

<strong>వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి</strong>వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి

Sasikala replies to EC's notice on her appointment as general secretary

తాత్కాలిక ఏర్పాట్లు చేసే అధికారం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్‌కు ఉందని ఆ లేఖలో వివరించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై వివరణ కోరుతూ శశికళకు ఈసీ ఇటీవల నోటీసు పంపించిన విషయం తెలిసిందే. శశికళ ఉంటున్న బెంగళూరు జైలుకే ఈ నోటీసులు వెళ్లాయి.

ఈ నెల 28వ తేదీలోగా శశికళ జవాబు ఇవ్వకుంటే, ఆమె వద్ద సమాధానం లేదని భావించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. జయలలిత మృతిచెందిన మరుసటి రోజే పార్టీ ప్రదాన కార్యదర్శిగా శశికళ నియామకం కావడంపై అన్నాడీఎంకే తిరుగుబాటు ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈసీ ఈ నోటీసులు పంపింది. దీనిపై శశికళ వివరణ ఇచ్చారు.

English summary
Convicted interim general secretary of AIADMK Sasikala Natarajan has replied to the notice issued by the Election Commission. The ECI had sought explanation on her appointment as the party's general secretary. The notice was sent to Bengaluru central prison where she is currently lodged after being convicted in a disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X