వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ సాగనంపితే.. శశి కీలక పదవి: అన్నాడీఎంకేలో ఆమె తర్వాత దినకరణే

జైలుకు వెళ్లడం ఖాయమని తేలడంతో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తన బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లను పార్టీలోకి తీసుకువచ్చారు శశికళ. కాగా, గతంలో వీరిద్దరినీ జయలలిత పార్టీ నుంచి సాగనంపడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో... తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే పగ్గాలను అప్పగించడంపై వీకే శశికళ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జైలుకు వెళ్లడం ఖాయమని తేలడంతో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తన బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లను పార్టీలోకి తీసుకువచ్చారు శశికళ. కాగా, గతంలో వీరిద్దరినీ జయలలిత పార్టీ నుంచి సాగనంపడం గమనార్హం.

తెలంగాణకు పన్ను చెల్లించాల్సిన శశికళ: నోటీసులు జారీతెలంగాణకు పన్ను చెల్లించాల్సిన శశికళ: నోటీసులు జారీ

ప్రస్తుతం ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న శశికళ... తన తర్వాత కీలక పదవి అయిన డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. తాను జైలుకెళ్లడం ఖాయం కావడంతో పార్టీపై పట్టునిలబెట్టుకునేందుకే శశికళ తన సోదరి కొడుకైన దినకరన్‌ను రంగంలోకి దించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కుట్రస్థానం పోయెస్‌ గార్డెన్‌, జయే మాస్టర్ మైండ్: సుప్రీం కీలక వ్యాఖ్యలివేకుట్రస్థానం పోయెస్‌ గార్డెన్‌, జయే మాస్టర్ మైండ్: సుప్రీం కీలక వ్యాఖ్యలివే

Sasikala's Betrayal? Nephews Expelled By Jayalalithaa Back In Party

కాగా, అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తొలిసారిగా శశికళ సృష్టించడం గమనార్హం. రెండు దశాబ్దాల నాటి జయలలిత అక్రమాస్తు కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

నేడు కోర్టులో లొంగిపోనున్న శశికళ!: లీగల్ అడ్వైజర్ల సూచన ఇదే, జయ బ్యారక్‌కే శశినేడు కోర్టులో లొంగిపోనున్న శశికళ!: లీగల్ అడ్వైజర్ల సూచన ఇదే, జయ బ్యారక్‌కే శశి

ఇదే కేసులో సహనిందితురాలిగా ఉన్న వీకే శశికళను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో జయలలిత స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలన్న శశికళ ఆశలు గల్లంతయ్యాయి. రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురికావడంతో శశికళకు జైలు జీవితం ఖరారైపోయింది. దీంతో కోర్టు ముందు లొంగిపోయేందుకు ఆమె బెంగళూరుకు బుధవారం బయల్దేరారు.

English summary
VK Sasikala, on the verge of a four-year jail term for corruption, made big moves today to secure her hold over Tamil Nadu's ruling party. Two of her relatives expelled by former Chief Minister J Jayalalithaa are back in the AIADMK. Among them is former lawmaker TTV Dinakaran, whose cousin Sudhakaran was convicted and sentenced to jail along with Ms Sasikala yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X