జయా టీవీ చేతులు మారింది: దిక్కులేరని, శశికళ ఆస్తులు మొత్తం ఆయన చేతికే !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన జయా టీవీ బాధ్యతలు చేతులు మారింది. జయలలిత మరణించిన తరువాత శశికళ కనుసైగలతో నడిచిన జయా టీవీ బాధ్యతలు ఆమె సోదరుడు జయరామన్ కుమారుడు వివేక్ చేతుల్లో వెళ్లిందని తె

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన జయా టీవీ బాధ్యతలు చేతులు మారింది. జయలలిత మరణించిన తరువాత శశికళ కనుసైగలతో నడిచిన జయా టీవీ బాధ్యతలు ఆమె సోదరుడు జయరామన్ కుమారుడు వివేక్ చేతుల్లో వెళ్లిందని తెలిసింది.

జయలలిత ఆకు పచ్చ చీరలతో బెంగళూరు జైల్లో శశికళ, సీఈవోతో తెప్పించుకుని !

అన్నాడీఎంకే (అమ్మ వర్గం) నాయకుల సమాచారం మేరకు జాజ్ సినిమాస్ సీఈవో వివేక్ జయా టీవీ బాధ్యతలు స్వీకరించారని వెలుగు చూసింది. ఇటీవల వివేక్ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో మేనత్త శశికళ నటరాజన్ ను కలిశాడు.

శశికళ సూచన మేరకు

జయా టీవీ బాధ్యతలు స్వీకరించాలని శశికళ సూచించడంతో వివేక్ అడుగులు ముందుకు వేశారని తెలిసింది. శశికళ మార్క్ తోనే వివేక్ జయా టీవీని ముందుకు నడిపించడానికి సిద్దం అయ్యాడని అన్నాడీఎంకేలోని చిన్నమ్మ వర్గం అంటోంది.

తీహార్ జైల్లో దినకరన్ ఉంటే ఎలా ?

శశికళ తరువాత జయా టీవీ బాధ్యతలు టీటీవీ దినకరన్ చూసుకునే వారని తెలిసింది. అయితే ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. ఇప్పుడు జయా టీవీకి యాజమాన్య కోరత తీర్చడానికి వివేక్ సిద్దం అయ్యాడని తెలిసింది.

జాజ్ సీనిమాస్ తో పాటు జయా టీవీ

ఇప్పటికే జాజ్ సినిమాస్ సీఈవోగా పని చేస్తున్న వివేక్ ఇప్పుడు జయా టీవీ కొత్త బాధ్యతలు స్వీకరించాడని తెలిసింది. శశికళకు చెందిన అన్ని వ్యాపారాలు ఇప్పుడు వివేక్ చేతికి వచ్చే అవకాశం ఉందని అన్నాడీఎంకేలోని చిన్నమ్మ వర్గంలోని నాయకులు అంటున్నారు.

సహాయం చెయ్యడనికి జనార్ధన్

జయా టీవీ బాధ్యతలు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవడానికి టీటీవీ దినకరన్ అనుచరుడు జనార్దన్ అలియాస్ జయా టీవీ జనా సిద్దం అయ్యాడని తెలిసింది. ఇప్పటికే జయా టీవీకి సంబంధించిన పూర్తి సమాచారం వివేక్ కు వివరించాడని తెలిసింది.

జనార్దన్ అంటే హడల్

జయా టీవీలో ఆఫీస్ అసిస్టెంట్ గా చేరిన జనార్దన్ ప్రస్తుతం ఉన్నతస్థాయి పదవిలో ఉన్నాడు. జనార్దన్ అంటే జయా టీవీలో పని చేసే వారు హడలిపోతారని తెలిసింది. టీటీవీ దినకరన్ శిష్యుడు అయిన జనార్దన్ చెప్పిందే వేదం అంటున్నారు అక్కడ పని చేసే సిబ్బంది.

అనుకున్నది చేస్తాడు

జయా టీవీలో ఏమి అనుకున్నా జనార్దన్ మరో ఆలోచన లేకుండా పూర్తి చేస్తాడని సమాచారం. టీవీ షోలు నిర్వహించడానికి జనార్దన్ చెప్పిన నటీమణులనే తీసుకోవాలని, అలా చెయ్యకుంటే వెంటనే అతని నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని తెలిసింది.

నమిత కోసం కుష్బూను తప్పించారు

గతంలో జయా టీవీలోని ఓ షోలో కుష్బూ వ్యాఖ్యతగా పని చేశారు. అయితే బహుబాష నటి నమిత కోసం జనార్దన్ స్వయంగా కుష్బూను తప్పించి నమితను వ్యాఖ్యాతగా చేర్పించి ఆ షో నడిపించాడని అన్నాడీఎంకే (అమ్మ) నాయకులు అంటున్నారు.

అన్నాడీఎంకేలోకి నమిత

టీటీవీ దినకరన్ ను జయలలిత పోయెస్ గార్డెన్ దారిదాపుల్లోకి రానివ్వలేదు. అన్నాడీఎంకే పార్టీ విషయాలు తెలుసుకోవాలని దినకరన్ ప్లాన్ వేశాడు. శశికళ సహకారంతో నమితను రంగంలోకి దింపారు. టీటీవీ దినకరన్, జనార్దన్ సూచన మేరకే నమిత జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారని శశికళ వర్గీయులు అంటున్నారు.

సినినా మార్క్ తో జయా టీవీ

జాజ్ సినిమాస్ వ్యవహారాలు చూసుకుంటున్న వివేక్ ఇక జయా టీవీని సినిమా మార్క్ తో నడిపించే అవకాశం ఉందని చిన్నమ్మ వర్గంలోని నాయకులు అంటున్నారు. మొత్తం మీద వివేక్, జనార్దన్ కలిసి జయా టీవీని ఏం చేస్తారో వేచిచూడాలి అంటున్నారు అమ్మ అభిమానులు.

English summary
VK Sasikala Natarajan's brother Jayaraman and Ilavarasi Son Vivek has taken incharge of Jaya TV,sources said.
Please Wait while comments are loading...