వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కోసం: పన్నీరును అడ్డుకున్నాం, బాగా చేయండి.. శశికళ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్టై, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్టై, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

శశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నోశశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నో

ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) అమ్మ జయలలిత జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. జయలలిత తొలి జయంతి కావడంతో.. ఈ మేరకు శశికళ పార్టీ కేడర్‌కు లేఖ రాశారు. సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

పన్నీరు సెల్వంపై

పన్నీరు సెల్వంపై

పార్టీని వెన్నుపోటు పొడవాలనుకున్న వారి ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని శశికళ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎంజీఆర్ వారసత్వం, జయలలిత కృషిని నీరుగారుద్దామనుకున్న వారి కుట్రలు సాగనివ్వలేదన్నారు.

దినకరన్ కలిసిన తర్వాత లేఖ..

దినకరన్ కలిసిన తర్వాత లేఖ..

ఎంజీఆర్ శతజయంతి సంవత్సరంలో జయలలిత కాపాడుకున్నామని శశికళ పేర్కొన్నారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆమెన బెంగళూరు జైలులో కలిసిన ఒకరోజు తర్వాత ఈ లేఖ బయటకు రావడం గమనార్హం.

ఆధిపత్య పోరు

ఆధిపత్య పోరు

జయలలిత, ఎంజీఆర్‌ల వారసత్వాన్ని, వారి ప్రతిష్టను పన్నీరు సెల్వం మట్టిపాలు చేసే ప్రయత్నాలు చేశారని శశికళ మండిపడ్డారు. అన్నాడీఎంకే పార్టీలో శశికళ - పన్నీరుసెల్వంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

జయలలిత జయంతి

జయలలిత జయంతి

అసలైన పార్టీ తమదే అంటే తమదే అని శశికళ, పన్నీరు వర్గం చెబుతోంది. జయలలితను ఎవరికి వారు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జయలలిత జయంతి వచ్చింది.

పన్నీరే అసలు వారసుడు..

పన్నీరే అసలు వారసుడు..

ఇప్పటికే పన్నీరు సెల్వం పైన చాలా సానుభూతి కనపడుతోంది. గతంలో జయలలిత పన్నీరుకే రెండుసార్లు అవకాశం ఇవ్వడం కూడా గమనార్హం. ఈ నేపథ్యంలో శశికళ కంటే పన్నీరే.. జయ అసలు వారసుడు అని ఆయన వర్గం చెబుతోంది. అదే సమయంలో శశికళను జయ రాజకీయాలకు దూరం పెట్టారని అంటున్నారు.

జయను సొంతం చేసుకునేందుకు..

జయను సొంతం చేసుకునేందుకు..

పన్నీరు సెల్వం అసలు వారసుడు అని ఆయన వర్గం గట్టిగా చెబుతున్న సమయంలో జయలలిత జయంతి వచ్చింది. దీని ద్వారా జయను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో శశికళ వర్గం కనిపిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈసీ నోటీసులు

ఈసీ నోటీసులు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న శశికళకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ పదవిలో కూర్చునేందుకు గల అర్హత ఏమిటో చెప్పాలని నోటీసులు ఇచ్చింది.

English summary
Sasikala, who is currently lodged at Bengaluru's Parapanna Agrahara Central Jail, in her letter slammed rebel party leader O Panneerselvam for 'betraying the legacy of Jayalalithaa and MGR.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X