వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.10 కోట్లు చెల్లించకుంటే మరో 13 నెలలు జైలులో శశికళ

కోర్టు తనకు విధించిన రూ.10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ చెల్లించని పక్షంలో మరో పదమూడు నెలలు జైలులో ఉండవలసి ఉంటుంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: కోర్టు తనకు విధించిన రూ.10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ చెల్లించని పక్షంలో మరో పదమూడు నెలలు జైలులో ఉండవలసి ఉంటుంది.

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ, మరో ఇద్దరికి సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.10 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఈ జరిమానాను చెల్లించకుంటే ఆమె మరో ఏడాదికి పైగా జైలులోనే ఉండవలసి ఉంటుంది.

<strong>ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనికి కూడా చెక్!</strong>ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనికి కూడా చెక్!

Sasikala to serve 13 more months in jail if fine is not paid

జైలు సూపరింటెండెంట్ కృష్ణ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శశికళ నటరాజన్ ఫైన్ చెల్లించని పక్షంలో మరో 13 నెలలు జైలులో ఉండవలసి ఉంటుందన్నారు.

శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అక్రమాస్తుల కేసులో ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీం కోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

<strong>'జయ మృతిపై ప్రకటన ఏది, ఏన్నో అనుమానాలు, శశికళది ఆవేశం'</strong>'జయ మృతిపై ప్రకటన ఏది, ఏన్నో అనుమానాలు, శశికళది ఆవేశం'

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం శశికళ శశికళ నాలుగేళల జైలు శిక్ష అనుభవించవలసి ఉంది. 2014లో ట్రయల్ కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించడంతో.. ప్రస్తుతం ఉన్న జైలులోనే అప్పుడు కొన్ని రోజులు శిక్ష అనుభవించారు. దీంతో మిగిలిన కాలం ఆమె జైలులో ఉంటారు. జరిమానా చెల్లించకుంటే శిక్ష పెరగనుంది.

English summary
"Sasikala Natarajan will have to pay Rs 10 crore and if she fails to pay the punitive amount imposed by the Supreme Court, she will have to serve 13 more months in the jail," Prisons Superintendent Krishna Kumar said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X