వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ టీంకు మరో చాన్స్: రెండాకుల గుర్తు ఎవరిదంటే !

122 మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ఎంపీలు మా వర్గంలోనే ఉన్నారని శశికళ వర్గం ఎన్నికల కమిషన్ కు మనవి చేసింది. పన్నీర్, శశికళ వర్గాల వాదన, వారు ఇచ్చిన వివరణ పరిశీలించిన ఎన్నికల కమిషన్ .

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళతనాడులో అధికారంలో ఉన్న మాకే రెండాకుల గుర్తు ఇవ్వాలని శశికళ వర్గంలోని నాయకులు భారత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. 122 మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ఎంపీలు మా వర్గంలోనే ఉన్నారని చిన్నమ్మ వర్గం ఎన్నికల కమిషన్ కు చెప్పింది.

మంగళవారం శశికళ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారత ఎన్నికల కమిషన్ ను కలుసుకుని రెండాకుల గుర్తు మాకే ఇవ్వాలని మరో సారి మనవి చేశారు. శశికళ వర్గం వివరణ ఇచ్చుకోవడానికి భారత ఎన్నికల కమిషన్ సోమవారం వరకు గడువు ఇచ్చింది.

Sasikala team has to give explaination on double leaf issue on today

అయితే శశికళ వర్గంలోని నాయకుల మనవి మేరకు మరో రోజు (మంగళవారం) వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక, రెండాకుల గుర్తు మాకే ఎందుకు ఇవ్వాలి అనే విషయంపై మరో సారి వివరణ ఇచ్చారు.

ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు రెండు సార్లు ఎన్నికల కమిషన్ ను కలుసుకుని రెండాకుల గుర్తు మాకే ఇవ్వాలని మనవి చేశారు. ఇరు వర్గాల వాదన, వారు ఇచ్చిన వివరణ పరిశీలించిన ఎన్నికల కమిషన్ రెండాకుల గుర్తు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై తుదినిర్ణయం తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

English summary
Sasikala Natarajan team has to give explaination on double leaf issue on today, EC extend the date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X