వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారిపై రేప్, హత్య: నిందితుడికి మరణశిక్ష విధించిన సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమేగాక, ఆమెను బండరాయితో మోది హత్య చేసిన కేసులో నిందితుడి(45)కి సుప్రీం కోర్టు మరణశిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన మహారాష్ట్రకు చెందిన నిందితుడిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చిన్నారులు ఎవరైనా తమ పొరుగు ఇంటి వ్యక్తులను బాబాయ్‌గా నమ్మి వారితో చనువుగా ఉంటారని, అలాంటి చిన్నారులపై ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులకు మరణ శిక్ష సరైనదేనని కోర్టు వ్యాఖ్యానించింది.

అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే గాకా, ఆమెను అత్యంత దారుణంగా బండరాయితో మోది హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష విధించడం సబబేనని కోర్టు పేర్కొంది.

SC awards death penalty to man for raping 4-yr-old girl, stoning her to death

ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి హాని జరుగుతుందని, అందువల్లే అతనికి మరణ శిక్షను విధించినట్లు ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

నీళ్ల సీసాలో పెట్రోలు తెచ్చి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో 8వ తరగతి విద్యార్థి ఒకరు పాఠశాల ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశాడు. నీళ్ల సీసాలో పెట్రోలు తీసుకుని పాఠశాలకు వచ్చిన విద్యార్థి.. తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు మంటలు ఆర్పి విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

హోలీ చైల్డ్ పాఠశాలకు చెందిన ఆ విద్యార్థికి 40శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి కొంత నిలకడగా ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

English summary
SC has awarded death sentence to a 47-year-old man from Maharashtra after finding him guilty of raping a 4-year-old girl and then stoning her to death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X