వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాయకుడిపై కేసు: జయ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పోలీసులు పెట్టుకున్న పిటీషన్ లో ఎలాంటి పస లేదని సుప్రీం కోర్టు కొట్టివేసింది.

వాపపక్ష గాయకుడు కోవన్ (54) తమిళనాడు ప్రభుత్వానికి, జయలలితకు వ్యతిరేకంగా పాటలు వ్రాసి పాడి ఆన్ లైన్ లో ఆ వీడియోలు అప్ లోడ్ చేశారు. విషయం తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్ 30వ తేదీన కోవన్ ను అరెస్టు చేసింది.

కోవన్ మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. కోవన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతనిని రెండు రోజుల పాటు తమ కస్టడికి ఇవ్వాలని తమిళనాడు పోలీసులు హై కోర్టును ఆశ్రయించారు. అయితే హై కోర్టులో పోలీసులకు నిరాశ ఎదురైయ్యింది.

SC Dismisses TN Government’s plea for police Custody of singer Kovan

తరువాత తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎఫ్ఎంఐ. కలివుల్లా, యూయూ. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అర్జీ విచారణ చేపట్టింది.

తమిళనాడు ప్రభుత్వం ఎందుకు కోవన్ ను కస్టడికి కోరుతుంది అంటూ కచ్చితమైన వివరాలు పొందుపరచలేదని ఆరోపిస్తూ పిటీషన్ కొట్టి వేసింది. గతంలో కోవన్ పోలీసు కస్టడి మీద హై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.

English summary
The Tamil Nadu state government had challenged the high court order which had stayed the remand of Kovan to police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X