చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్న అలలు, కొట్టుకొచ్చిన పడవలు

తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం సముద్ర తీరం రెండు రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సాధారణ స్థాయి కంటే పది అడుగుల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం సముద్ర తీరం రెండు రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సాధారణ స్థాయి కంటే పది అడుగుల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి.

దీంతో తీరాన ఉన్న పడవలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి నిత్యం దేశ, విదేశాలకు చెందిన వేలాదిమంది వస్తుంటారు.

Sea waves up to 10 feet high in Mahabalipuram

వారు కాసేపు సముద్రతీరంలో సేదతీరుతుంటారు. వాతావరణ మార్పులతో రెండు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారి రాక్షస అలలు ఎగసిపడుతున్నాయి.

శనివారం సాయంత్రం ఈ అలలు పది అడుగులకు పైగా ఎగిసిపడ్డాయి. అలల ఉధృతికి తీరాన ఉంచిన రెండు పడవలు కూడా సముద్రంలో కొట్టుకుపోయాయి.

రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం ఉండడంతో వెయ్యిలోపే నాటు పడవలు మాత్రం సముద్రంలో వేటకు వెళుతుండగా, సముద్రం అల్లకల్లోలం కారణంగా కేవలం వందలోపే జాలర్లు వేటకు వెళ్లారు.

English summary
Sea waves up to 10 feet high in Mahabalipuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X