వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎస్టేట్ నాది!: 'కొడనాడు'పై మహిళ, జయలలితకు రెండో ఇల్లు

దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య కలకలం రేపుతోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య కలకలం రేపుతోంది. కోటగిరికి సమీపంలో జయలలితకు చెందిన ఈ టీ ఎస్టేట్‌ వద్ద గార్డుగా పని చేస్తున్న ఓంకార్ బహదూర్ (51) అనే వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున 10 మంది గుర్తు తెలియని నరికి చంపారు.

<strong>జయలలిత కొడనాడ్ ఎస్టేట్ గార్డ్ దారుణ హత్య: జయ ఆస్తుల టార్గెట్ వెనుక?</strong>జయలలిత కొడనాడ్ ఎస్టేట్ గార్డ్ దారుణ హత్య: జయ ఆస్తుల టార్గెట్ వెనుక?

దీనిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు, కొడనాడ్ ఎస్టేట్ ప్రాపర్టీ తనదేనని ఓ మహిళ తెరపైకి వచ్చారు. ఈ ఎస్టేట్ జయలలితది. కానీ ఇప్పుడు మహిళ తెరపైకి రావడం చర్చకు వచ్చింది.

ఎస్టేట్ తనదని ఓ మహిళ

ఎస్టేట్ తనదని ఓ మహిళ

ఈ ఎస్టేట్ తనది అని సదరు మహిళ చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అన్నీ కూడా తన పేరిటనే ఉన్నాయన్నారు. అయితే, ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

జయలలిత రెండో ఇల్లుగా..

జయలలిత రెండో ఇల్లుగా..

కొడనాడ్ ఎస్టేట్ జయలలితకు రెండో ఇల్లుగా చెబుతారు. అమ్మ ఈ ఎస్టేట్‌కు వచ్చినప్పుడల్లా కారును ఆపి, తమతో ఆప్యాయంగా మాట్లాడేవారని ఈ ఎస్టేట్‌లో పని చేసే వారు ఆమె మృతి చెందిన సమయంలో గుర్తు చేసుకున్నారు.

ఆస్తుల కేసు విచారణ సమయంలో..

ఆస్తుల కేసు విచారణ సమయంలో..

జయలలిత ఆస్తుల కేసు విచారణ నేపథ్యంలో ఈ ఎస్టేట్ కూడా విచారణ అధికారుల దృష్టిలో ఉంది. ఆస్తుల కేసు నేపథ్యంలో ఈ ఎస్టేట్‌ను సీజ్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఆమె మృతి నేపథ్యంలో ఈ ఎస్టేట్ సీజ్ అవుతుందన్న ప్రచారానికి తెరపడింది.

విశ్రాంతి కోసం

విశ్రాంతి కోసం

కొడనాడు టీ ఎస్టేట్ నీలగిరి జిల్లాలోని కొటగిరి సమీపంలో ఉంది. జయలలిత, శశికళ తదితరులు అప్పుడప్పుడు విశ్రాంతి కోసం ఇక్కడకు వెళ్లేవారు.

దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

కాగా, జయలలితకు చెందిన టీ ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డు హత్యకు గురైన విషయం తెలిసిందే. కోటగిరికి సమీపంలో జయలలితకు చెందిన కోదనాడ్‌ ఎస్టేట్‌ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బహదూర్‌ను సోమవారం తెల్లవారుజామున వ్యక్తులు దారుణంగా నరికి చంపారు.

అదే సమయంలో కృష్ణా బహదూర్‌ అనే మరో వాచ్‌మెన్‌ వారిని అదుపు చేయడానికి యత్నించగా అతనిపై దాడి చేసి పరారయ్యారు. క్షతగాత్రుడు కృష్ణా బహదూర్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary
A group of men hacked to death early on Monday morning a middle-aged security guard and seriously injured another at a sprawling estate in Tamil Nadu’s Kodanad, owned by former state chief minister J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X