వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే ఫడ్నవీస్ ప్రమాణం, థాకరే అనుమానమే(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ సీకారోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ మొదటిసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించే వేడుకకు సుమారు 40 వేల మంది హాజరు అవుతారని అంచనా. దేవేంద్ర ఫడ్నవీస్‌ మంత్రివర్గంలో చోటు కోసం బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరేను దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వయంగా ఆహ్వానించారు.

ముఖ్యమంత్రితో పాటు మరో 10 మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం. శుక్రవారం నాటి కార్యక్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రమాణం చేస్తారని బీజేపీ స్పష్టం చేసినట్లు సమాచారం. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దుతపై శివసేన మంతనాలు జరుపుతోంది.

మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఎమ్మేల్యేలతో ఉద్ధవ్ థాకరే చర్చులు జరుపుతున్నారు. సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నివీస్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే విముఖత చూపుతున్నట్లు సమాచారం.

శివసేన మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం లేదు: రాజీవ్ ప్రతాఫ్ రూడీ

శుక్రవారం నాడు మహారాష్ట్రలో ఏర్పడబోయే ప్రభుత్వంలో శివసేన సభ్యులు చేరడం లేదని బీజేపీ నేత రాజీవ్ ప్రతాఫ్ రూడీ స్పష్టం చేశారు. శివసేన పార్టీతో జరుపుతున్న చర్చలు సానుకూలంగా ముగస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రమాణ స్వీకారానికి బీజేపీ డబ్బుని దుర్వినియోగం చేస్తోంది: ఎన్‌సీపీ

శుక్రవారం జరగనున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్కువ డబ్బుని వెచ్చిస్తున్నారని ఎన్‌సీపీ ఆరోపించింది. "మాహారాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి బీజేపీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది" అని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ సీకారోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ మొదటిసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు.

 సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించే వేడుకకు సుమారు 40 వేల మంది హాజరు అవుతారని అంచనా. దేవేంద్ర ఫడ్నవీస్‌ మంత్రివర్గంలో చోటు కోసం బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం


ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరేను దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వయంగా ఆహ్వానించారు. ప్రమాణస్వీకారంలో తమకూ భాగం కల్పించాలని శివసేన బీజేపీని కోరింది.

 సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ సీకారోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం సెక్యూరిటీ పనులను పరిశీలిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా.

 సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ గురువారం ఢిల్లీలో పార్టీ సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.

 సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

సినీ వేడుకలా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ గురువారం ఢిల్లీలో పార్టీ సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి రాష్ట్ర మంత్రి వర్గంలో కూర్పుపై చర్చించారు.

English summary
Aerial view of the Wankhede stadium after the preparation for swearing in ceremony gets completed, in Mumbai on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X