వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రైలు ప్రమాదం: 37 మంది మృతి, హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హర్దా: మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి.

ఆ తర్వాత 11.45 గంటలకు అదే మార్గం మీదుగా వచ్చిన జనతా ఎక్స్‌ప్రెస్ సమాచారలోపంతో పట్టాలు తప్పింది. జనతా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 5 బోగీలు నదిలో పడిపోయాయి. జబల్‌పూర్‌ నుంచి ముంబయి వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ ఖిర్కియా- బిరంగి రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది.

ఈ ఘోర ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా గాయపడ్డారు. మందికిమృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సంఘటనా స్ధలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు.

Several passengers feared dead as two trains derail in Madhya Pradesh

ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘోర సంఘటన హర్దాకు 25 కిలో మీటర్ల దూరంలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దాదాపు 300 మంది ప్రయాణికులను కాపాడారు.

మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఈ ప్రమాదం మాచక్‌ నది దాటాక కల్వర్టు దగ్గర చోటుచేసుకుందని చెప్పారు. భారీవర్షాలకు కల్వర్టుపై రెండు ట్రాక్‌లు కుంగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ప్రయాణికుల్లో చాలామందిని రక్షించి, ఇటార్సీ రైల్వేస్టేషనుకు తరలించామని రైల్వేఅధికారులు వివరించారు. ఈ సంఘటనలో 300 మంది ప్రయాణికులను స్థానికులు కాపాడారు. భారీవర్షాలకు పట్టాలు కొట్టుకుపోయి ప్రమాదాలు జరిగినట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ ఎ.కె. మిత్తల్‌ చెప్పారు.

ఈ ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రైల్వే శాఖ రూ. 50వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

Several passengers feared dead as two trains derail in Madhya Pradesh

ప్రయాణికులను ఇటార్సీ స్టేషన్‌కు చేర్చాం: అనిల్‌ సక్సేనా

మధ్యప్రదేశ్‌లోని హర్దా వద్ద రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికులను ఇటార్సీ స్టేషన్‌కు చేర్చామని రైల్వేశాఖ పీఆర్వో అనిల్‌ సక్సేనా తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోకి నీరు చేరిందని పేర్కొన్నారు.

రైళ్లు నిలిపివేత:

మధ్యప్రదేశ్‌‌లో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లను నిలిపివేశారు. ముంబై, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్‌-కోట మీదుగా మళ్లించారు.

ప్రమాదం సంభవించిన హర్దా వద్ద మూడు రైళ్లను రద్దు చేశారు. 25 రైళ్లను దారి మళ్లించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఎంత మంది మరణించారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పట్టాలు తప్పిన బోగీల్లోకి వరద నీరు చేరడంతో మృతుల సంఖ్య మరితంగా పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పారు.

Several passengers feared dead as two trains derail in Madhya Pradesh

మధ్యప్రదేశ్ రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు:

మధ్యప్రదేశ్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ 15 బోగీలకు పైగా నదిలో పడిపోయిన సంగతి తెలిసిందే.

హెల్ప్ లైన్ నంబర్లు: ముంబై: 02225280005 భోపాల్: 0755 4001609 హర్దా: 09752460088 బీనా: 07580 222052 ఇటార్సి: 07572 241920 కళ్యాణ్: 02512311499 థానె: 0225334840

మధ్యప్రదేశ్ ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు:

మధ్యప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదాల ఘటనపై రాత్రే స్పందించిన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వంతెనలు దెబ్బతిన్నాయని అన్నారు. వంతెనపై చేరిన వరద నీటి కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.

రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందన:

మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. రైలు ప్రమాదం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని మోడీ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్‌లోని రైలు ప్రమాదాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

English summary
Several passengers were feared dead when two express trains on Tuesday night derailed while crossing a bridge on swollen Machak river near Harda in Madhya Pradesh, senior district officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X