వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ జడ్జికీ తప్పని లైంగిక వేధింపులు

|
Google Oneindia TeluguNews

సిమ్లా: మహిళా జడ్జిని వేధింపులకు గురి చేసిన న్యాయమూర్తిని సస్పెండ్ చేశారు. న్యాయమూర్తిని సస్సెండ్ చేశామని హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.

రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని దర్యాప్తు చేస్తున్న అధికారులకు సూచించారు. జూన్ 8వ తేదిన మనాలిలో మాదకద్రవ్యాల నేరాలపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఆ సమయంలో అనేక రాష్ట్రాల న్యాయమూర్తులు ఆ సదస్సుకు హాజరైనారు.

Sexual Harassment Complaint by a Woman Judge

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళా జడ్జితో పాటు ఆ రాష్ట్రంలోని పలువురు న్యాయమూర్తులు హాజరైనారు. ఆ సందర్బంలో సదరు జడ్జి తనకు కంపెనీ ఇవ్వాలని బలవంతం చేశాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేదించారని మహిళ జడ్జి ఆరోపించారు.

ఇదే విషయంపై హిమాచలప్రదేశ్ హైకోర్టుకు ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హైకోర్టు పలు విషయాలు తెలుసుకుని సదురు జడ్జిని సస్పెండ్ చేసింది. విచారణ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.

English summary
A judge in Himachal Pradesh has been suspended following a sexual harassment complaint by a woman judge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X