వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో బాలికపై లైంగిక వేదింపులు, యువకుడి అరెస్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో మరోక బాలిక మీద లైంగిక వేదింపులు జరిగాయి. బాలికను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ బెంగళూరులోని హెణ్ణూరు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. హెణ్ఱూరులో నివాసం ఉంటున్న బాబు (19) అనే యువకుడిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు చెప్పారు. బాలుడి ఇంటి పక్కనే 10 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో బాబు అక్కడికి వెళ్లి లైంగిక వేదింపులకు గురి చేశాడు.

శుక్రవారం బాలిక మీద లైంగిక వేదింపులు చేశాడు. విషయం గుర్తించిన స్థానికులు బాబును పట్టకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించామని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు అన్నారు.

sexual harassment on 10 year girl in bangalore

బెంగళూరు నగరంలో ఇటివల చిన్నారుల మీద అత్యాచారయత్నాలు, లైంగిక వేదింపులు ఎక్కువ అవుతున్నాయి. చివరికి కార్పొరేట్ పాఠశాలలలో చిన్నారులకు రక్షణ లేకుండ పోతున్నది. ఇటివల బెంగళూరులోని విబ్గ్యార్ స్కూల్ లో ఆరు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరగడంతో బెంగళూరు ఉలిక్కి పడింది. స్కూల్ కు వెళ్లిన చిన్నారులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా ? లేదా ? అని వారి కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూసే పరిస్థితి ఎర్పడింది.

ఇంటి ముందు ఆడుకుంటున్నచిన్నారులను చాక్లెట్లు తీసి ఇస్తామని చెప్పి బటయకు తీసుకు వెళ్లి లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారు. ఐటి, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో బాలికల మీద ఎక్కువగా లైంగిక దాడులు, వేదింపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు చేసే వారిని, లైంగిక వేదింపులకు గురి చేసే వారిని శిక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఎన్జీఓలు అంటున్నారు.

English summary
A ten year old girl has been sexually assaulted in Benagaluru of Karnataka, a 19 year boy has been arrested in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X