వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్యర్యం: ‘‘కార్గోలో వచ్చింది.. బిజినెస్‌ క్లాస్‌లో వెళ్తోంది.. బరువు తగ్గినట్లా? కాదా?’’

ఈజిప్షియన్ భారీకాయురాలు ఎమాన్ అహ్మద్‌ గుర్తుందా? సుమారు 500 కేజీల బరువుతో చికిత్స కోసం మనదేశానికి ఛార్ట‌ర్డ్‌ కార్గో విమానంలో వచ్చిన ఈమె మొత్తానికి బాగానే బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె బరువు 176 కేజీ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబయి: ప్రపంచంలోనే అత్యధిక బరువు కలిగిన ఈజిప్టు మహిళ ఎమాన్‌ అహ్మద్‌ ముంబయిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స అనంతరం సగానికిపైగా బరువు తగ్గిన ఆమెను యూఏఈకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గతంలో సుమారు 500 కేజీల బరువుతో ఉన్న భారీకాయురాలిని ఛార్ట‌ర్డ్‌ కార్గో విమానంలో ముంబయికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె బరువు 176 కేజీలు మాత్రమే. దీంతో ఇప్పడు ఆమెను సాధారణ విమానంలో బిజినెస్‌ క్లాస్‌ ప్యాసింజర్‌గా అబుదాబికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

eman-ahmed

దీనిపై ముంబయి సైఫీ ఆస్పత్రికి చెందిన బేరియాట్రిక్‌ సర్జరీ సెక్షన్‌ చీఫ్‌ అపర్ణా భాస్కర్‌ మాట్లాడుతూ 'ఎమాన్‌ను ఛార్టెడ్‌ కార్గో విమానంలో ఇక్కడకు తీసుకువచ్చారు. ఇప్పుడు చికిత్స అనంతరం విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో ఆమెను తరలిస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్‌లో 500 కేజీల బరువున్న ఆమె.. ప్రస్తుతం 176.6 కేజీలు మాత్రమే ఉన్నారు. మరి బరువు తగ్గినట్లా? కదా? ' అని వ్యాఖ్యానించారు.

ఎమాన్‌ను అబుదాబిలోని బూర్జిల్‌ ఆస్పత్రికి తరలించనున్నారు. వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌లో భాగమైన ఈ ఆస్పత్రి వైద్యులు బుధవారం ముంబయిలో ఎమాన్‌ను ఆమె సోదరి షైమా అభ్యర్థన మేరకు పరిశీలించారు. అబుదాబిలో ఆమెకు రెండో దశ ఫిజియోథెరపీని కొనసాగించనున్నారు.

ఎమాన్‌కు అందిస్తున్న వైద్యంపై ఆమె సోదరి షైమా ఇటీవల వైద్యులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమాన్‌ బరువు తగ్గలేదని, వైద్యులు అబద్దం చెబుతున్నారని షైమా పేర్కొన్న నేపథ్యంలో వైద్యులు ఎమాన్ ను పరిశీలించారు.

English summary
Doctors treating Eman Ahmed Abd El Aty, the nearly 500-kg Egyptian and possibly the world’s heaviest woman, have said she has lost a considerable amount of weight within the last one month. Eman arrived in Mumbai on February 11 for a weight-reduction surgery and is being treated in Mumbai’s Saifee Hospital. Doctor say the 36-year-old needs to lose 200kg in the next six months. “Physiotherapists and the diet team are keeping a close watch on her. Right now, we are focusing on stabilising her hormonal levels and kidney functions, reducing water retention and increasing limb activity, that will ultimately help her increase her metabolism rate,” one of the top doctors on the 13 member panel treating her said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X