వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్లో పట్టుబడ్డ ఇంద్రానీ, హీనా హత్యపై కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: షీనా బోరా హత్య నేపథ్యంలో ఆమె తల్లి, కేసులో నిందితురాలు ఇంద్రానీకి సంబంధించి మరో షాకింగ్ అంశం వెలుగు చూసింది. ఇంద్రానీ ముఖార్జియా 2001లో సెక్స్ రాకెట్ వ్యవహారంలో పట్టుబడినట్లుగా తెలుస్తోంది.

2001లో పోలీసులు వ్యభిచార గృహాల పైన దాడులు నిర్వహిస్తున్నప్పుడు ఆ సమయంలో ఇంద్రానీ కూడా పట్టుబడిందని తెలుస్తోంది. ఆమె పైన కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత బెయిల్ పైన విడుదల చేశారని తెలుస్తోంది.

 Sheena Murder Case: Indrani was caught in sex racket in 2001

వివరాలు వెల్లడించిన డ్రైవర్

షీనా బోరా హత్య కేసు ఓ కొలిక్కి వస్తోన్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ శ్యాం ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కొలిక్కి వస్తున్నట్లుగా సమాచారం. ఆ రోజు ఏం జరిగిందనే విషయమై డ్రైవర్ పోలీసుల విచారణలో పూసగుచ్చినట్లుగా తెలుస్తోంది. తద్వారా కీలక సమాచారం దొరికిందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు ఇంద్రానీని, ఆమె రెండో భర్త సంజయ్ ఖన్నాను, డ్రైవర్ శ్యాంను విచారిస్తున్నారు. గుర్తు తెలియని ప్రదేశంలో విచారిస్తున్నారు. ముగ్గురూ హత్య చేయలేదని వాదిస్తుండటంతో అందర్నీ ఒకే దగ్గరకు తీసుకు వచ్చి ఇంటరాగేట్ చేస్తున్నారు.

తాను కారు నడుపుతున్నానని, హత్య చేయలేదని డ్రైవర్ చెప్పారని తెలుస్తోంది. షీనా గొంతు నులిమింది సంజీవ్ ఖన్నాయేనని ఇంద్రానీ ఆరోపించిందని తెలుస్తోంది. అయితే కారులో తాను నిద్ర లేచాక షీనా మృతదేహం కనబడిందని సంజయ్ చెబుతున్నాడని తెలుస్తోంది. అయితే, డ్రైవర్ కీలక విషయం చెప్పినట్లుగా సమాచారం.

కాగా, షీనాను హత్య చేసిన అనంతరం, ఆమెను తగలబెట్టిన ప్రాంతాన్ని ముంబై పోలీసులు తవ్వారు. ఈ సందర్భంగా ఆమెకు చెందిన కొన్ని ఎముకలు, పుర్రెతో పాటు ఒక సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు.
షీనా తల్లి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు ముంబై కోర్టు ఆగస్టు 31 వరకు పోలీస్ రిమాండ్ విధించింది.

షీనా సోదరుడు మిఖాయిల్ బోరా గౌహతి నుంచి ముంబై చేరుకున్నాడు. తన సోదరి హత్య కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. డీఎన్ఏ టెస్టుల కోసం అతను వచ్చారు. ఇంద్రాణిని పోలీసులు గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి, విచారిస్తున్నారు.

ఇంద్రాణిని కలవడానికి ఆమె లాయర్‌కు ముంబైలోని బాంద్రా కోర్టు అనుమతించింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

హత్య తర్వాత రాజీనామా, వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

షీనా హత్యకు గురైన కొన్ని వారాల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు షీనా పని చేస్తున్న కంపెనీకి రాజీనామా లేఖ అందింది. షీనా రాసినట్టు రాజీనామా లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Latest investigating into the case revealed that Indrani Mukherjea was caught in a sex racket in 2001 and was earlier know as Pari Bora.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X