వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: గ్యాంగ్ రేప్ చేశాడని తీసుకొచ్చి సెల్ లో పెడితే.. మళ్లీ అక్కడ.., ఆ తరువాత ఏం జరిగిందంటే...

బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్‌లో ఉంచితే.. అతడు పోలీసుల సమక్షంలో మరో ఘాతుకానికి ఒడికట్టాడు. అనంతరం తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సిమ్లా: బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని సెల్‌లో ఉంచితే.. అతడు పోలీసుల సమక్షంలో మరో ఘాతుకానికి ఒడికట్టాడు.

సిమ్లా లోని కోట్‌ఖాయీ ప్రాంతానికి చెందిన బాలిక(16) పదో తరగతి చదువుతోంది. ఈమె ఈనెల 4న అదృశ్యమైంది. రెండు రోజుల అనంతరం ఆ బాలిక మృతదేహం పోలీసులకు లభ్యమైంది.

అత్యాచారం, ఆపైన హత్య...

అత్యాచారం, ఆపైన హత్య...

మృతదేహాన్ని శవపరీక్షకు పంపగా ఆ బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని, అనంతరం దుండగులు ఆమెను చంపేశారని తేలింది. బాలికపై సామూహిక అత్యాచారానికి నిరసనగా స్థానికులు ఆందోళన చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

లాకప్ లోనే డిష్యూం.. డిష్యూం..

లాకప్ లోనే డిష్యూం.. డిష్యూం..

ఈ కేసులో నిందితుడైన రాజేంద్ర సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని స్టేషన్ కు తరలించి, లాకప్ లో ఉంచారు. ఇతడిని ఉంచిన లాకప్ లోనే అప్పటికే అదే కేసులో అరెస్టయిన సూరత్ సింగ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక్కడే పోలీసులు పొరపాటు చేశారు. అందరినీ విడివిడిగా లాకప్ లలో ఉంచకుండా మొత్తాన్ని రెండు లాకప్ లలో ఉంచారు.

పోలీస్ స్టేషన్ లోనే హత్య?

పోలీస్ స్టేషన్ లోనే హత్య?

పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉన్న సూరత్ సింగ్ ను చూడగానే రాజేంద్ర సింగ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆర్థరాత్రి సమయంలో రాజేంద్ర, సూరత్ లాకప్ లోనే గొడవ పడ్డారు. రాజేంద్ర ఆగ్రహం పట్టలేక సూరత్ ను కొట్టి చంపేశాడు. ఇది గమనించిన పోలీసులు సూరత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు.

రెచ్చిపోయిన జనం, పోలీస్ స్టేషన్ కు నిప్పు...

సూరత్ సింగ్ లాకప్ డెత్ విషయం ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న జనం రెచ్చిపోయారు. మధ్యాహ్నం ప్రాంతంలో దాదాపు 3 వేల మంది పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఆ తరువాత ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు కోట్‌ఖాయీ పోలీస్ స్టేషన్ మీద రాళ్లు రువ్వారు. అంతటితో ఈ గొడవ ఆగలేదు. పోలీసు వాహనానికి నిప్పటింటించడమే కాక, నలుగురు పోలీసులను కూడా నిర్బంధించారు.

సీఎం సీరియస్.. అందరూ సస్పెండ్...

ఈ విషయం కాస్తా సీఎం వరకు వెళ్లడంతో.. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విధి నిర్వహణలో విఫలమవడమే కాక, ఇంత విధ్వంసం జరగడానికి కారణమైనందుకు కోట్‌ఖాయీ పోలీసు స్టేషన్‌లోని సీఐ, ఎస్పైలతో సహా సిబ్బందినంతా సస్పెండ్ చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

English summary
An accused in the murder and gangrape of a 16-year-old girl in Himachal Pradesh’s Kotkhai died in police custody early Wednesday, triggering violent clashes across the state that saw a mob burn down a police station and pelt stones at security personnel. The accused, Nepalese national Surat Singh, was allegedly strangled by another suspect, Rajendra Singh, during a scuffle inside the lock-up around 3am on Wednesday, police said. News of his death sent ripples of anger through the Himalayan state as people shouted slogans, clashed with police and blocked arterial roads, demanding an overhaul of what protesters deem a shoddy probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X