వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: స్కూల్ పిల్లలకు ఆశారాం బాపూ 'సెక్స్ టిప్స్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దేశంలో నిరుద్యోగానికి వర్కింగ్ మహిళలు కారణమని పాఠ్య పుస్తకాల్లో కనిపించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, మరో వివాదం చెలరేగింది. సమాచారం మేరకు.. ఆశారాం బాపు సెక్స్ టిప్స్‌కు సంబంధించిన పుస్తకాలను పంచారు.

రాష్ట్రంలోను పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆశారాం బాపుకు చెందిన సెక్స్ టిప్స్‌కు సంబంధించిన పుస్తకాలను పంచి పెట్టారని విమర్శలు వస్తున్నాయి. మరో షాకింగ్ అంశం ఏమంటే... కొండగాన్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ పుస్తకాలలోని శృంగార టిప్స్‌ను విద్యార్థులచే బలవంతంగా చదివించారని చెబుతున్నారు.

 Shocking: Govt school teaches Asaram's book on sex tips; probe ordered

ఆ పుస్తకం పేరు 'దివ్య ప్రేరణ-ప్రకాశ్'. దీనిని తనకు తాను దేవుడిగా చెప్పుకునే ఆశారాం బాపు రాశారు. ఆ పుస్తకంలో దారుణమైన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరికైనా శృంగారంలో సంతృప్తి లేకుంటే... అది వారి జీవితం పైన ప్రభావం చూపుతుందని ఆ పుస్తకంలో ఉందని తెలుస్తోంది.

ఆంగ్ల మీడియాలో వస్తున్న దాని ప్రకారం... 2012లో రమణ్ సింగ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. అయితే, నోటీసులను కొన్ని జిల్లాలకు పంపించడంలో సంబంధిత శాఖ విఫలమైందని తెలుస్తోంది. దీంతో, పలు జిల్లాల్లో ఈ పుస్తకాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, దీని పైన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విచారణకు ఆదేశించారు.

English summary
Days after Chhattisgarh government faced flak for blaming working women for unemployment in the country, BJP government once again has courted controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X