వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భిణి మెడ పట్టి లాక్కెళ్లి, తిన్న పులిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెళగావి: 23 ఏళ్ల ఓ గర్భిణీని చంపి, అవయవాలను తిన్న ఓ పులి పైన 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్స్ ఇచ్చారు. ఆ మహిళను అంజన హనబార్‌గా గుర్తించారు. ఆమె అవయవాలను తినగా కొన్ని మిగిలిపోయాయి. వాటిని గురువారం ఉదయం కరగలి గ్రామంలో గుర్తించారు.

అంజన నీళ్లు తెచ్చేందుకు ముదగాయి గ్రామంలోని అవుట్ స్కర్ట్స్‌కు బుధవారం వెళ్లింది. ఇది ఖానాపూర్ తాలుకాలోని జంబోటీ అరణ్యం ప్రాంతంలో ఉంది. అప్పుడు పులి దాడి చేసి ఆమెను చంపేసి, అవయవాలను తినేసింది. ఈ విషయమై అధికారుల పైన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామస్థులు తమ పైన మండిపడుతుండటంతో.. అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో సదరు పులి పైన షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడు పులిని జూకు పంపించాలని చూస్తున్నారు. గ్రామస్తులు కూడా పులిని పట్టుకోవాలని అధికారుల పైన ఒత్తిడి తెచ్చారు.

‘Shoot-at-sight’ order for tiger after attack on woman

మహిళ మెడను పట్టుకొని పులి ఆమెను అడవిలోకి లాక్కెళ్లింది. ఆమె ముఖం, మెడ, కడుపు, ఓ కాలు.. ఇలా అవయవాలను తినేసింది. మృతురాలి కుటుంబ సభ్యులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. రెండు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి ఇవ్వనున్నారు.

ఫారెస్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చిక్‌మగ్‌లూరులోని పాండరవల్లి గ్రామంలోను ఇదే పులి ఓ మహిళను చంపిందని చెప్పారు. ఈ సంఘటన నవంబర్ 19వ జరిగింది.

అధికారుల పైకి రాళ్లు

పులిని పట్టుకునేందుకు వచ్చిన కొందరు పోలీసులు చెట్ల కింద కూర్చొని తాపీగా తింటుండాన్ని చూసిన గ్రామస్థులు వారి పైకి రాళ్లు రువ్వారు. పులి వల్ల తాము నిత్యం భయాందోళనలో ఉంటే వారు మాత్రం దానిని పట్టుకోవడం పక్కన పెట్టారని ఆరోపించారు.

English summary
Shoot-at-sight order for Belagavi tiger that killed a 23-year-old woman in Jamboti village of Belagavi district Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X