వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మై హస్బండ్ మేడ్ మి ఎ ప్రాస్టిట్యూట్': నెట్లో తాగొద్దంటూ వీడియో హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద చేసిన ఓ షార్ట్ ఫిలిం ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. 'మై హస్బండ్ మేడ్ మి ఎ ప్రాస్టిట్యూట్' అనే పేరుతో తీసిన ఈ కల్పిత షార్ట్ ఫిలిం తాగి వాహనం నడపరాదు అనే సందేశాన్ని ఇస్తోంది. దీనిని ఇంటర్నెట్లో జోరుగా చూస్తున్నారు.

 Short film on drunk and driving goes viral online

ఈ షార్ట్ ఫిలింను ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మందికి పైగా చూశారు. దీనిని వీడియో షేరింగ్ వెబ్ సైట్ యూ ట్యూబ్‌లో సోమవారం అప్ లోడ్ చేశారు. ఇది మూడు నిమిషాల విడిది గల వీడియో. దీనిని గురువారం వరకే దాదాపు ఎనిమిది లక్షల మంది వరకు చూశారు.

దీనిని పంకజ్ ఠాకూర్ డైరెక్ట్ చేశారు. అన్నింటి కంటే దారుణమైనది తాగి వాహనం నడపడమే అని సందేశం ఇస్తోంది. తాగి వాహనం నడిపి, ఏదైనా జరిగితే.. భార్య, కుటుంబ సభ్యులు జీవించేందుకు ఎంతగా బాధపడవలసి ఉంటుందో ఇందులో కల్పిత కథగా చెప్పారు.

ఇందులో ఓ మహిళ తాను ప్రాస్టిట్యూట్‌గా ఎలా మారానో చెబుతుంది. అయితే, అది మాటల ద్వారా కాకుండా, కేవలం పిక్చరైజేషన్ ద్వారా చూపించారు. ఈ వీడియో ద్వారా అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఈ కల్పిత కథను రాసింది.. జోయ్‌బ్రాతో దత్తా.

English summary
What is the worst thing that can happen to a man who drinks and drive. Probably this. This film is a fictional account about his family. How his wife battles the world to survive and to pay the bills. Directed by Pankaj Thakur, Written by Joybrato Dutta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X