వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ టీవీ షో ల్లో జడ్జిగా కొనసాగొచ్చు: పంజాబ్ అడ్వకేట్ జనరల్ నివేదిక

పంజాబ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.ఈ మేరకు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు తన నివేద

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్: పంజాబ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.ఈ మేరకు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు తన నివేదికను పంపారు.

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంస్కృతికశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

అయితే సిద్దూ ఓ టీవీ షో లో నిర్వహించే కామెడీ షోకు ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రిగా కూడ బాద్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఈ విషయమై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై న్యాయసలహ తీసుకొంది.

Sidhu can continue as celebrity guest, no conflict of interest: Punjab AG

ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అతుల్ నందా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందింది.ఈ నివేదిక ప్రకారంగా సిద్దూ టీవీ షో లో జడ్జిగా వ్యవహరించుకోవచ్చని ఆ నివేదిక వెల్లడించింది.

ఈ విషయమై ఒకానొక దశలో సిద్దూకి కేటాయించిన పోర్ట్ ఫోలియోను మార్చాలని కూడ భావించారు.అయితే అడ్వకేట్ జనరల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఫోర్ట్ ఫోలియోను మార్చాల్సిన అవసరం రాలేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ చెప్పారు.

1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారాన్ని అతిక్రమించేటట్టుగా ఈ వ్యవహరం లేదని అడ్వకేట్ జనరల్ ఈ నివేదికలో చెప్పారు. దీంతో సిద్దూ టీవీ షోలు నిర్వహించుకొనేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ నాలుగు పేజీల నివేదికను పంపారు. ఈ నివేదికలో మంత్రిగా సిద్దూ తన విధుల నిర్వహణకు గాను, టీవీ షో లో జడ్జిగా వ్యవహరించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.ఈ విషయమై సిద్దూ తన టీవీ షో ల విషయమై అడ్వకేట్ జనరల్ నుండి అభిప్రాయాన్ని కోరితే ఆయన ఈ మేరకు నివేదికను సమర్పించారు.

English summary
Punjab Minister Navjot Singh Sidhu can continue as a celebrity-judge on a popular TV comedy show and there is no conflict of interest in it, according to state's Advocate General Atul Nanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X