వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ 'ఒకే ఒక్కడు'?: ఆదాయ పన్ను బకాయి రూ.21,870 కోట్లు.. అదీ ఒక్క ఏడాదిలో!

2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒక పన్ను చెల్ల్లింపుదారుడి పన్ను బకాయి ఏంతో తెలుసా? వింటే గుండె ఆగిపోతుంది. అక్షరాలా రూ.21,870 కోట్లు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒక పన్ను చెల్ల్లింపుదారుడి పన్ను బకాయి ఏంతో తెలుసా? వింటే గుండె ఆగిపోతుంది. అక్షరాలా రూ.21,870 కోట్లు. ఈ మొత్తం దేశంలో 11 శాతం మంది పన్ను చెల్లింపుదారులు చెల్లించే పన్నుకు సమానం.

ఈ విషయాన్ని కేంద్ర ఆదాయపు పన్ను శాఖే బయట పెట్టింది. మరికొందరు రూ.500 కోట్ల మేర ఆదాయపు పన్ను చెల్లించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే వీరి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

 Single Taxpayer Owes 11% of India’s Individual Income Tax in the FY 2014-15

ఇంత భారీ మొత్తంలో ఆదాయపు పన్ను ఎవరు బకాయి పడ్డారు? భారీ మొత్తంలో ఎవరు పన్ను చెల్లించారు? ఇలాంటి వివరాలను మాత్రం వెల్లడించబోమని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

దేశంలో 58 శాతం సంపద కేవలం ఒక్క శాతం వ్యక్తుల దగ్గరే ఉందని, దేశంలోని 70 శాతం ప్రజల దగ్గర ఉన్న సంపదకు సమానమైన ఐశ్వర్యం 57 మంది కోటీశ్వరుల ఆధీనంలో ఉన్నట్లు 'ఆక్స్ ఫాం' ప్రకటించింది.

ఇక 2013-14 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం.. భారత్ లో 36.5 మిలియన్ల మంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ఈ అర్థిక సంవత్సరంలో వేతన జీవులు చెల్లించిన పన్ను రూ.9.8 లక్షల కోట్లు. దేశ ఆదాయపు పన్ను చెల్లింపుల్లో దాదాపు 53 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ ల నుంచే వస్తున్నట్లు సమాచారం.

English summary
An unnamed taxpayer owed the government Rs 21,870 crore for the assessment year 2014-15, which was 11% of income tax to be paid by all Indians, according to 2016 data, the latest available, from the Income Tax department. While three individual taxpayers declared business income of over Rs 500 crore, But The names of these taxpayers are not made public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X