వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సుందరయ్య తర్వాత రెండో తెలుగు వ్యక్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఎన్నికలాంఛనమే అయింది. ఈ పదవికి పోటీలో సీతారాం ఏచూరీ, రామచంద్రన్ పిళ్లైలు పోటీ పడ్డారు. అయితే, అనూహ్యంగా పిళ్లై ఆదివారం నాడు పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో ఏచూరీ ఎంపిక లాంఛనమే అయింది. ఏచూరి ఎన్నికలను ప్రకాశ్ కరత్ ప్రకటించారు. సుందరయ్య తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వాడు ఏచూరి.

ముందే అభినందించిన మాజీ ముఖ్యమంత్రి

Sitaram Yechury is the new general secretary of the CPI (M)

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఆదివారం నాడు ఎన్నుకోనున్న నేపథ్యంలో శనివారం కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అచ్యుతానందన్.. ఏచూరికి ముందే అభినందనలు తెలిపారు. ఒకే హోటల్లో బస చేసిన వారిద్దరూ మహాసభలకు వెళ్తున్న క్రమంలో ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా అచ్యుతానందన్.. పార్టీని ముందుకు నడిపించేందుకు యువత అవసరమని, మీకు నా ముందస్తు శుభాకాంక్షలు అన్నారు.

సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశంలో శనివారం నాడు.. పోలిట్ బ్యూరోను, జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ముందే ఏకగ్రీవానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే రామచంద్రన్ పిళ్లై తప్పుకొని ఉంటారు.

English summary
Sitaram Yechury is the new general secretary of the CPI (M)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X