వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

నోయిడా: పని ఒత్తిడి కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నోయిడాలో జరిగింది. అవనీష్ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ వ్రాసిపెట్టాడు.

ఉత్తరప్రదేశ్ లోని అజంగడ్ కు చెందిన అవనీష్ గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను సోదరుడితో కలిసి గ్రేటర్ నోయిడా సెక్టార్ -2 లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇతని సోదరుడు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.

software engineer allegedly committed suicide

ఆ సందర్బంలో అవనీష్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన అవనీష్ సోదరుడు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ నోయిడా సెక్టార్ -2 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అవనీష్ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ లో తనకు ఉద్యోగరీత్య తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని, అంతే కాకుండా సొంత సమస్యలు తట్టుకోలేకపోతున్నానని వ్రాసి ఉందని పోలీసులు తెలిపారు.

English summary
Avnish, who belonged to Azamgarh in Uttar Pradesh and was working with a Noida-based company, hanged himself when nobody was home on Sunday, police said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X