వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యం కోసం అమెరికాకు సోనియా గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరిక్షల కోసం అమెరికా వెళ్లారు. వారం రోజుల పాటు ఆమె అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

అయితే సోనియా గాంధీ రోటీన్, రెగ్యులర్ చెకప్ కోసమే అమెరికా వెళ్లారని, వారం రోజులలో తమ నాయకురాలు తిరిగి భారత్ చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాల స్పష్టం చేశారు.

Sonia Gandhi has gone to the US for a regular Medical checkup.

సోనియా గాంధీ రెండు నెలల క్రితమే రెగ్యులర్ చెకప్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉండింది. అయితే బీహార్ శాసన సభ ఎన్నికలు రావడంతో ఆమె తన అమెరికా పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

68 సంవత్సరాలు వయస్సు ఉన్న సోనియా గాంధీ ప్రస్తుతం తీరికగా ఉన్నారని, అందు వల్లనే అమెరికా వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే సోనియా గాంధీ వెంట అమెరికాకు ఎవరు వెళ్లారు అని మాత్రం పార్టీ వర్గాలు వెల్లడించలేదు.

English summary
Congress President Sonia Gandhi has gone to the United States for a regular, routine Medical checkup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X