వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక వాట్సప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు

రానున్న కొద్ది రోజుల్లోనే మీరు ఎల్పీజీ సిలిండర్‌ను వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రానున్న కొద్ది రోజుల్లోనే మీరు ఎల్పీజీ సిలిండర్‌ను వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల వాట్సప్ బుకింగ్స్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అక్కడ విజయవంతమైన తర్వాత దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీనిపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది.

Soon book your LPG cylinder via WhatsApp

దేశంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఈ మేరకు సమాచారం అందించడం జరిగింది. ఎల్పీజీని ఇప్పటికే ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా బుకింగ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు వాట్సప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ మరింత సులభతరం కానుంది.

ఈ విధానం అమలుపై ఇప్పటి వరకు సానుకూల స్పందనలే వచ్చాయి. మొదట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అమలు చేసి, ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

English summary
Soon, you can start booking your LPG cylinder on WhatsApp. The Narendra Modi government which had made gas booking easy has now decided to make the process easier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X