పోయెస్ గార్డెన్ లో అర్దరాత్రి అరుపులు: దినకరన్ ఫ్యామిలీ ఔట్, ఐదు కారణాలే సాక్ష్యం!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు గిట్టనివారి అంతు చూసేందుకు ఆత్మ రూపంలో సంచరిస్తున్నారని మరోసారి వెలుగు చూసింది. ఎన్నో సంవత్సరాల నుంచి జయలలితకు ఎంతో ఇష్టం అయిన పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు గిట్టనివారి అంతు చూసేందుకు ఆత్మ రూపంలో సంచరిస్తున్నారని మరోసారి వెలుగు చూసింది. ఎన్నో సంవత్సరాల నుంచి జయలలితకు ఎంతో ఇష్టం అయిన పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ అరుపులు, కేకలకు ప్రత్యక్ష సాక్షం అయ్యారు.

ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికతో చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో పని చేస్తున్న ఉద్యోగులు మాట్లాడారు. గత కొంత కాలంగా పోయెస్ గార్డెన్ లో వింతవింత శభ్దాలు, కేకలు వినిపిస్తున్నాయని చెప్పారు. జయలలితకు గిట్టనివారు పోయెస్ గార్డెన్ లో అడుగుపెడితే అలాంటి కేకలు, అరుపులు మరింత ఎక్కువ అవుతున్నాయని అక్కడి ఉద్యోగులు బల్లగుద్ది చెబుతున్నారని ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది.

పోయెస్ గార్డెన్ ఉద్యోగులు

జయలలిత మరణించిన తరువాత జరిగిన ఐదు సంఘటనలు చూస్తే అమ్మ ఆత్మ రూపంలో ఇక్కడిక్కడే తిరుగుతున్నారని చెప్పడానికి బలమైన సాక్షాలు కనిపిస్తాయని పోయెస్ గార్డెన్ ఉద్యోగులు అంటున్నారు. అమ్మకు కీడు చెయ్యాలన్నా, ఆమె ఆస్తుల జోలికి వచ్చినా కచ్చితంగా వదిలిపెట్టరని వెలుగు చూస్తోందని అంటున్నారు.

ఈ ఐదు ఘటనలు సాక్షం

చెన్నై శివార్లలోని శిరువత్తూరులోని జయలలిత బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగి విలువైన పత్రాలు బూడిద అయ్యాయి. కొడనాడు ఎస్టేట్ లో హత్య చేసిన కేసు ప్రధాన నిందితుడు కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జయలలిత మరణించిన తరువాత పోయెస్ గార్డెన్ లో మకాం వేసిన శశికళ, దినకరన్ వరుసగా జైలుకు వెళ్లారు. మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి దగ్గర భద్రత కల్పిస్తున్న 20 మంది సిబ్బంది వరుసగా జ్వరంతో బాధపడుతున్నారు.

జయలలిత గదిలో శశికళ !

జయలలిత మరణించిన తరువాత శశికళ పోయెస్ గార్డెన్ లోని అమ్మ గది నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది ప్రముఖులు పోయెస్ గార్డెన్ చేరుకుని జయలలితకు నివాళులు అర్పించి శశికళకు ధైర్యం చెప్పారు. అనేక మంది మంత్రులు రోజూ పోయెస్ గార్డెన్ చేరుకుని శశికళ సూచనలు, సలహాలు తీసుకున్నారు.

సీఎం కావాలునుకున్న శశికళ జైలుకు

జయలలిత మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నాడీఎంకే పార్టీ నాయకులే అంటున్నారు. జయలలితకు ఆమె కుటుంబ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు చెయ్యలేదని ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యకలాపాలకు, పదవులకు దూరంగా ఉంటానని శశికళ స్వయంగా లిఖితపూర్వకంగా జయలలితకు లేఖ రాసి ఇచ్చారని అంటున్నారు. అలాంటి శశికళ పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం కావాలని ఆశపడిన రెండు మూడు రోజుల్లో జైలు శిక్షకు గురైనారని గుర్తు చేస్తున్నారు.

జయలలిత ఆస్తుల స్వాధీనం

జయలలిత ఆస్తులు మొత్తం శశికళ కుటుంబ సభ్యుల చేతికి వెళ్లాయి. శిరువత్తూరులోని బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగి విలువైన పత్రాలు కాలిపోయాయి. కోడనాడులో జయలలిత నగలు, నగదు దోచుకోవడానికి ప్రయత్నించిన ఆమె మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాధంలో దుర్మరణం చెందాడు. మరో నిందితుడు సయాన్ మరో ప్రమాదంలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

దినకరన్ కు అదే గతి

శశికళ జైలుకు వెళ్లిన తరువాత టీటీవీ దినకరన్ పోయెస్ గార్డెన్ చేరుకుని జయలలిత గదిలో మకాం వేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడు. పోయెస్ గార్డెన్ కు ఐదేళ్లపాటు దినకరన్ ను దూరం పెట్టిన జయలలిత మళ్లీ పగతో రగిలిపోయారని అంటున్నారు. అందుకే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ కు గట్టి ఎదురుదెబ్బ తగలడం, ఎన్నికల సంఘానికి రూ. 50 కోట్లు లంచం ఎర వేసిన కేసులో అరెస్టు అయ్యి తీహార్ జైలుకు వెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయని అమ్మ అభిమానులు అంటున్నారు.

దినకరన్ ఫ్యామిలీ ఔట్ !

దినకరన్ జైలుకు వెళ్లిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు పోయెస్ గార్డెన్ లో ఉంటున్నారు. అయితే అర్దరాత్రి అయిన వెంటనే పోయెస్ గార్డెన్ లో పెద్ద పెద్ద శభ్దాలు, కేకలు వినపడటంతో దినకరన్ కుటుంబ సభ్యులు హడలిపోయారని అక్కడి ఉద్యోగులు అంటున్నారు. వరుసగా నాలుగు రోజులు ఇవే శభ్దాలు, అరుపులు, కేకలు వినపడటంతో దినకరన్ కుటుంబ సభ్యులు పోయెస్ గార్డెన్ ఖాళీ చేసి వెళ్లిపోయారని అక్కడి పని చేస్తున్న ఉద్యోగులు చెప్పారు.

మెరీనా బీచ్ లో అమ్మ

మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర 20 మంది మూడు షిఫ్ట్ ల్లో భాద్రత కల్పిస్తున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న భద్రతా సిబ్బంది వరుసగా జ్వరంతో పాటు అనారోగ్యానికి గురై బాధపడుతున్న విషయం కళ్లకు స్ఫష్టంగా కనపడుతోందని అమ్మ అభిమానులు అంటున్నారు.

అమ్మకు గిట్టనివారు వస్తేనే అరుపులు

జయలలిత ఇంత కాలం పోయెస్ గార్డెన్ కు దూరం పెట్టిన వారు అక్కడ అడుగుపెడితే అరుపులు కేకలు వినపడుతున్నాయని, మరెవరైనా అక్కడ ఉన్నా అలాంటి శభ్దాలు రావడంలేదని పోయెస్ గార్డెన్ లోని సిబ్బంది చెప్పారని ఆంగ్లదినపత్రిక కథనం ప్రచురించింది.

జయలలిత దెయ్యం అయ్యారా ?

జయలలిత దెయ్యం అయ్యారని ప్రచారం జరుగుతోంది. తనకు గిట్టని వారు, ద్రోహం చెయ్యడానికి ప్రయత్నించే వారిని అంతు చూడటానికి సిద్దం అయ్యారని అంటున్నారు. సొంత కుటుంబ సభ్యులను దూరం పెట్టి ప్రజల కోసం చివరి వరకు పోరాడి ప్రాణం విడిచిన జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి కొందరు ప్రయత్నించడంతో అమ్మ ఆత్మ రూపంలో తిరుగుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

English summary
J Jayalalithaa: Sources in Poes Garden claim that they hear ‘strange voices that sound like wails’ every night.
Please Wait while comments are loading...