వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌత్ ముస్లింలు ఐఎస్‌కు ఆకర్షితులయ్యారు: కిరణ్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల భావాలకు దక్షిణ భారత్‌కు చెందిన రాష్ట్రాల నుండి ముస్లింలు ఎక్కువగా ప్రభావితం అయ్యారని శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అయితే, ఇతర ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల చర్యలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుందని తెలిపారు. ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అంగీకరించాల్సిందేనని రిజిజు స్పష్టం చేశారు.

 South Indian Muslims more attracted to IS: Kiren Rijiju

ఉగ్రవాద దాడుల్లో కేవలం ఒకే ఉగ్రవాది పాల్గొని కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ తరహా దాడులు ఇండియాలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

ముంబై దాడులు జరిగి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. దేశంలో జరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల పట్ల కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దేశానికి, దేశంలోని ప్రజలను పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. కాశ్మీర్‌లో కొందరు ఐఎస్ఐఎస్ ఎగురవేయడంపట్ల ఆయన స్పందిస్తూ.. అవి కొందరు ఆకతాయిలు చేసిన ప్రయత్నమేనని, ఐఎస్ ప్రచారానికి వాడుకుంటున్న అన్ని వెబ్‌సైట్లపై నిఘా ఉంటుందని తెలిపారు.

English summary
Union minister of state for home affairs Kiren Rijiju has claimed that Islamic State may carry out "lone wolf" terrorist strikes intended to create mayhem anywhere in the country even as the government is taking measures to contain the activities of the outfit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X