వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పెషల్ ట్రీట్‌మెంట్ కోసం ముస్లీంలు పాక్ వెళ్లాలి, వందేమాతరం పాడాలి: శివసేన

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: భారత దేశంలోని ముస్లీంలు తమకు ఇక్కడ ప్రత్యేక ట్రీట్‌మెంట్ (రిజర్వేషన్లు) కోరుకుంటే వారు అందుకు పాకిస్తాన్ వెళ్లాలని శివసేన మంగళవారం సూచించింది. శివసేన పత్రిక అయిన సామ్నా ముస్లీంల రిజర్వేషన్ల పైన స్పందించింది. వారు (ముస్లీంలు) ఈ దేశం నుండి ఏదైనా కావాలనుకుంటే.. మొదట భారత దేశాన్ని మాతృదేశంగా అంగీకరించాలని, అలాగే వందేమాతరం పాడాలని పేర్కొంది.

మహారాష్ట్రంలో వెనుకబడిన ముస్లీంలకు రిజర్వేషన్లు కల్పించాలని మజ్లిస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శివసేన దాని పైన స్పందించింది. ముస్లీంలకు రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లాలని సూచించింది.

 For special treatment, go to Pakistan: Shiv Sena tells Muslims

విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారి పైన ఫడ్నవీస్ ప్రభుత్వం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రంలో ముస్లీంలకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్న వారు తీవ్రవాదులు, ముస్లీం తీవ్రవాదుల హింసాత్మక చర్యల వల్ల ఎంతమంది హిందువులు నష్టపోయారో తెలుసా అని ప్రశ్నించింది.

రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉండాలని పేర్కొంది. పేద ముస్లీంలకు రిజర్వేషన్లు ఉండాలని, అయితే వారు ముస్లీం అయినందుకు కాదని, భారత దేశ పౌరుడు అయినందుకు అన్నారు.

English summary
"If the Muslim community in India want any special treatment as Muslims, they should go to Pakistan," the Shiv Sena warned here Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X