వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు ప్రాణం అయిన పోయెస్ గార్డెన్ ఎవరిదంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకుని ఒక వెలుగు వెలిగిన జయలలిత ఇప్పుడు చెన్నైలోని మెరినా బీచ్ లో శాస్వతంగా నిద్రిస్తున్నారు. జీవితాన్ని ఎన్నోమలుపులు తిప్పినా అదే పోయెస్ గార్డెన్ లో జీవించిన జయలలిత ఇప్పుడు ఆమె మరణం తరువాత ఆ పోయెస్ గార్డెన్ ఎరికి చెందినది అని వీలునామా రాశారని వెలుగు చూసింది.

24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పోయోస్ గార్డెన్ ఉంది. వైభవోపేతంగా నిర్మించిన పోయెస్ గార్డెన్ అంటే జయలలితకు ప్రాణం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ ఇంటిని మారాలని జయలలిత ఆలోచించలేదు.

జయలలిత తరువాత పోయెస్ గార్డెన్ కు వారసులు ఎవరు అనేది అన్నాడీఎంకే కార్యకర్తల మిలియన్ డాలర్ల ప్రశ్న. కోట్ల రూపాయల విలువైన పోయోస్ గార్డెన్ తన ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళకు చెందాలని జయలలిత వీలునామా రాశారని సమాచారం.

 sprawling bungalow Poes Garden would go to her close aide and confidante Sasikala Natarajan !

2014లోనే జయలలిత పోయెస్ గార్డెన్ శశికళకు చెందాలని వీలునామా రాశారు. అయితే తరువాత వీలునామా మార్చారా ? లేదా ? అనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అదే విధంగా నీలగిరిలోని కోదండ ఎస్టేట్, శశి ఎస్టేట్స్ సైతం ఇప్పుడు నెచ్చెలి శశికళ చేతిలోకి వెళ్లనున్నాయి.

జయ పబ్లికేషన్స్ సైతం శశికళ సొంతం కానుంది. ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైప పోయెస్ గార్డెన్ ను జయలలిత 1967 కేవలం రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. ఏఐఏడీఎంకేలో జయలలిత తరువాత అంత ప్రభావం చూపించే వ్యక్తిగా శశికళ గుర్తింపు తెచ్చుకున్నారు.

జయలలిత బ్రతికున్న సమయంలోనే శశికళ తన హవా చాటారు. అన్నాడీఎంకే పార్టీలో జయలలిత అమ్మగా, శశికళ చిన్నమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో ఏ టూ ఝడ్ అయిన శశికళ చెప్పిందే వేదం.

2016లొ జరిగిన శాసన సభ ఎన్నికల సందర్బంగా జయలలిత ఎన్నికల అధికారులకు అఫిడివిట్ సమర్పించారు. అఫిడివిట్ ప్రకారం జయలలిత ఆస్తులు రూ. 113.73 కోట్లు. అందులో రూ. 41.63 కోట్ల చరాస్తీ, రూ.72.09 కోట్ల స్థిరాస్తి ఉంది. జయలలిత దగ్గర కేవలం రూ. 41 వేల నగదు మాత్రమే ఉంది. రూ. 2.04 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు ఈ ఆస్తులు మొత్తం శశికళ చేతిలోకి వెలుతున్నాయని సమాచారం.

English summary
For many the will drawn up by J Jayalalithaa is of immense interest. A source says that there was a will drawn up by Jayalalithaa two years back in which she is said to have stated that this sprawling bungalow Poes Garden would go to her close aide and confidante Sasikala Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X