వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులు అంటూ నమ్మించిన ఉగ్రవాదుల: అద్దెకు ఇల్లు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్ లో భారత్ భద్రతా దళాల దాడుల్లో అంతం అయిన ఇద్దరు ఉగ్రవాదుల గురించి పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఉగ్రవాదులు విద్యార్థుల ముసుగులో వారం రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి అదే ఇంటిలో స్కెచ్ వేశారని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. శ్రీనగర్ లోని సరాయ్ బాల ప్రాంతంలోని ఓ ఇంటి దగ్గరకు వెళ్లారు.

ఇంటి యజమానురాలు వితంతువు అని తెలుసుకున్న ఉగ్రవాదులు డ్రామా ఆడారు. తాము విద్యార్థులమని, చదువుకోవడానికి గది అద్దెకు కావాలని ఆమెను నమ్మించారు. అయితే ఆమె పూర్తి వివరాలు తెలుసుకోకుండా వారికి గది అద్దెకు ఇచ్చారు. వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు పరిశీలించలేదు.

 Srinagar terrorist posed as Students

కచ్చితమైన వివారాలు తెలుసుకున్న భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను అంతం చేశాయి. ఎన్ కౌంటర్ లో అంతం అయిన ఉగ్రవాదులు జైష్- ఈ =మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని కాశ్మీర్ డీజీపీ (సెంట్రల్) గులామ్ హసన్ బట్ చెప్పారు. ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని మనవి చేశారు.

ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి రాలేదని, ఇక్కడి నుంచే ఉగ్రవాదులకు సహకారం అంధిస్తున్నారని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులు సైతం మరణించిన విషయం తెలిసిందే.

English summary
The two militants were staying as tenants in the house of a widow. They had told the owner they were students,'' said deputy inspector general Ghulam Hassan Bhat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X