వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ 1 బీ వీసాల వాడకాన్ని నిలిపివేయాలి, స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే భయం లేదు

హెచ్ 1 బి వీసాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దేశీయ ఐటి కంపెనీలకు సూచించారు. స్థానికులకే ఐటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:హెచ్ 1 బి వీసా భయంతో దేశీయ మార్కెట్లో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.అయితే దేశీయ కంపెనీలు మరింత బహుళ సంస్కృతికి అలవాటు పడాలని ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

అమెరికా అథ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ లోని ఐటి కంపెనీలు ట్రంప్ నిర్ణయాల కారణంగా నుఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అమెరికాలో ఎన్నికల ప్రచారంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ట్రంప్ ప్రచారం చేశాడు. ఈ ప్రచారం పట్ల స్థానికులు ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. అయితే అమెరికాలో చోటుచేసుకొన్న మార్పులకు అనుగుణంగా దేశీయ కంపెనీలు కూడ మార్పులకు అలవాటుపడాలని ఐటి దిగ్గజం నారాయణమూర్తి సూచిస్తున్నారు.

హెచ్ 1 బి వీసాల వాడకం నిలిపివేయాలి

హెచ్ 1 బి వీసాల వాడకం నిలిపివేయాలి

హెచ్ 1 బి వీసాల వాడకం నిలిపివేయాలని ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దేశీయ ఐటి కంపెనీలకు సూచించారు.దేశీయ ఐటి కంపెనీలు బహుళ సంస్కృతికి అలవాటు పడాల్సిన అవసరం ఉందన్నారాయన. హెచ్ 1 బి వీసాల వాడకాన్ని నిలిపివేయాలని ఆయన సూచించారు.

అమెరికాకు తరలింపును నిలిపివేయాలి

అమెరికాకు తరలింపును నిలిపివేయాలి

భారతీయులను ఉద్యోగాల కోసం విదేశాలకు తరలించడాన్ని నిలిపివేయాలని ఆయన సూచించారు. స్థానిక ఉద్యోగుల నియామకంపై దృష్టి సారిస్తే ఈ రకమైన ముప్పు నుండి బయటపడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. విదేశీ వర్కర్లపై కఠిన ఆదేశాలు విధించేందుకు ట్రంప్

ఆడ్మినిస్ట్రేషన్ తీసుకొంటున్న నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ఐటి కంపెనీలు తమ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించండి

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించండి

అమెరికాలో అమెరికా నివాసం ఉండేవారికి, కెనడాలో కెనడియన్లకు, బ్రిటన్ లో బ్రిటిష్ వారిని నియమించుకోవాలని నారాయణమూర్తి సూచించారు. ఈ రకంగా ఉద్యోగులను నియమించుకోవడం ద్వా బహుళ జాతీయ కంపెనీలుగా పేరులోకి వచ్చే అవకాశం ఉందన్నారాయన.హెచ్ 1 బీ

వీసాల వాడకాన్ని కూడ తగ్గించేయాలని నొక్కి చెప్పారు.

బహుళ సాంస్కృతిక కంపెనీలుగా మారడం సులభం కాదు

బహుళ సాంస్కృతిక కంపెనీలుగా మారడం సులభం కాదు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వస్తే దేశీయ ఐటి కంపెనీలు మరింత బహుళ సాంస్కృతిక కంపెనీలుగా మారడానికి ఎంతో సహకరించనున్నాయన్నారు. బహుళ సాంస్కృతిలా మారడం అంతా సులభం కాదని ఆయన ఓ ఇంగ్లీష్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
చెప్పారు.మన కంపెనీల ఆలోచనలు అందుకే ఎప్పుడూ సాఫ్ట్ గా ఉంటాయని చెప్పారు. ట్రంప్ ఆడ్మినిస్ట్రేషన్ తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా దేశీయ కంపెనీలు మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.

English summary
indian software companies need to stop sending people on h-1b visas and focus on local hiring in the america, infosys co-founder narayana murthy said amid rising concerns over donald trump administration's proposals to restrict inflow of foreign workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X