వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో విధ్వంసం సృష్టించిన భూకంపం: కుప్పకూలిన చారిత్రక ధరారా టవర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌లో శనివారం ఉదయం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. రాజధాని ఖాట్మండులో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది.

ఖాట్మండులోని ఇళ్లు, భవనాలు, పురాతన ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలు కుప్పకూలాయి. ఖాట్మండులోని 62 మీటర్ల ఎత్తైన చారిత్రక ధరారా టవర్ కూప్పకూలింది. ఈ టవర్ కింద 50 మంది చిక్కుకుపోయారు.

Strong earthquake rocks Nepal, damages Kathmandu

దీంతో నేపాల్ ప్రభుత్వం అత్యవసర స్ధితిని ప్రకటించింది. దీంతో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల నుంచి భారీగా మృతదేహాలను బయటకు తీస్తున్నారు. నేపాల్‌లోని భరత్ పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భూమిలో 11 కిమీ లోతులో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

తొలుత 11.41 నిమిషాలకు నిమషం 8 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రతం రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదైంది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.

దీని తర్వాత మరోసారి రెండు భూకంపం వచ్చింది. నేపాల్‌లోని కొడారి ప్రాంతంలో 5.1 తీవ్రతతో రెండోసారి భూమి కంపించినట్లుగా అధికారులు గుర్తించారు. పాత ఖాఠ్మండులోని హన్‌మాన్ డోక ప్రాంతంపై ఈ భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. బ్రిటిష్‌ ఎంబసీ భవనం గోడలు కూలి 15ఏళ్ల బాలిక మృతి చెందింది.

వరుసగా భూమి ప్రకంపించడంతో నేపాల్ ప్రజలు భాయందోళనకు గురవుతున్నారు. నేపాల్‌లోని కీర్తిపూర్‌కు 69 కిమీ దూరంలో 6.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. భూ ప్రకంపనల తీవ్రతకు ఖాఠ్మండులోని విమానాశ్రయం కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో విమాన సర్వీసులు నిలిపివేశారు.

నేపాల్‌లో గత 80 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపంగా అధికారులు వెల్లడించారు. నేపాల్‌ రాజు కోటకు కాడా బీటలు వారినట్లు తెలుస్తోంది. వరస భూ ప్రకంపనలతో ఎవరెస్ట్‌ శిఖరంపై కొండచరియలు విరిగిపడ్డాయి.

ఖాఠ్మండులోని భారత్ ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లు:

0977 98511 07021, 0977 98511 35141

English summary
A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and dozens of injuries, eyewitnesses say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X