వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ప్రొఫెసర్ కాస్త ‘తేడా’.. తక్షణమే రాజీనామా చేయమన్న కాలేజీ యాజమాన్యం

విద్యార్తుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ని కాలేజీ యాజమాన్యం విధుల్లోంచి తప్పించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే అసోసియేట్ ప్రొఫెసర్(స్వలింగ సంపర్కుడు)ని విధుల్లోంచి తప్పించారు. అతడి వల్ల విద్యార్తుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో ఆయనను బలవంతంగా ఉద్యోగంలోంచి తీసివేశారు.

ఈ విషయాన్ని సదరు ప్రొఫెసరే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే... బెంగళూరులో సెయింట్ జోసెఫ్ కాలేజీ ఉంది. ఇందులో ఆంగ్ల విభాగంలో ఆష్లే టెలీస్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నడు.

ఇతడు స్వలింగ సంపర్కుడు(గే). పైగా ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడు కూడా. కొన్ని విషయాలపై అతడికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. వాటిని అతడు విద్యార్థులపై రుద్దుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.

'Students Are Disturbed': Bengaluru College Sacks Gay Professor

ఈ నేపథ్యంలో అతడు పని చేస్తున్న కాలేజీ యాజమాన్యం అతడిని రాజీనామా చేయమని ఆదేశించింది. ఈ విషయాన్ని ఆ ప్రొఫెసరే చెప్పారిలా... ''2017 మార్చి 9న నేను బీకాం సెకండియర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాను. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంటూ ఫాఠం మధ్యలో నన్ను పిలిచారు. అక్కడికెళ్లాక పది నిమిషాలు వేచి ఉండమన్నారు. ఆ తరువాత నన్ను లోపలికి పిలిచి.. 'నీ వ్యక్తిగత అభిప్రయాల కారణంగా విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. వెంటనే నీ బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపో.. ఇది ఇప్పుడే జరగాలి' అని చెప్పారు.

వాస్తవానికి విద్యార్థులు నిజంగానే డిస్ట్రబ్ అయితే.. అలా చేయడం కూడా బోధకుల పనే. అలా చేయలేకుంటే విద్యార్తులు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది..'' అంటూ సదరు ప్రొఫెసర్ తన అనుభవాన్ని ఫేస్ బుక్ పేజీలో పంచుకున్నారు.

English summary
NEW DELHI: Ashley Tellis, Associate Professor and an LGBT rights activist was sacked by a Bengaluru college citing his involvement in "anti-college activities" and for hurting the "sensitivities of undergraduate students from heterogeneous backgrounds" in his classes. Prof Ashley was teaching in the Department of English, St Joseph's College' Bengaluru. The Professor now has hit back with several other Facebook posts accusing the college of playing games to expel him from the college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X